Donald Trump: పిచ్చి బాస్టర్డ్స్.. హార్మూజ్‌ను తెరవండి.. లేకపోతే విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం
- మంగళవారం ఇరాన్‌లో ‘పవర్ ప్లాంట్ డే’, ‘బ్రిడ్జ్ డే’ ఒకేసారి
- ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం
- హార్మూజ్‌ను తెరవండి.. లేకపోతే విధ్వంసమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కఠిన వైఖరి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఒక తీవ్రమైన పోస్ట్‌లో, హార్మూజ్ జలసంధిని తెరవాలని ఆయన ఇరాన్‌ను హెచ్చరించారు. అలా చేయని పక్షంలో భారీ దాడిలు చేస్తామని బెదిరించారు. ఏప్రిల్ 6 గడువుకు ఒక రోజు ముందు అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌పై ఒత్తిడిని పెంచారు. మంగళవారం ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను లక్ష్యంగా చేసుకోవచ్చని ట్రంప్ హెచ్చరించారు.
Also Read:SRHvsLSG : ఉప్పల్‌లో లక్నో నవాబుల హవా.. సన్‌రైజర్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
“మంగళవారం ఇరాన్‌లో ‘పవర్ ప్లాంట్ డే’, ‘బ్రిడ్జ్ డే’ ఒకేసారి జరుగుతుంది. ఇలాంటిది ఎక్కడా చూడలేరు!!! హార్ముజ్ జలసంధి తెరవండి, మీ పిచ్చి బాస్టర్డ్స్… లేదంటే మీరు నరకంలో జీవించాల్సి వస్తుంది.. చూడండి!” (అసభ్య భాషలో)అంటూ ఇరాన్ పై విరుచుకుపడ్డాడు. అమెరికా-ఇజ్రాయిల్ దాడుల తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిని దాదాపుగా మూసివేసింది. ప్రపంచంలోని సుమారు 20% ఆయిల్ రవాణా ఈ జలసంధి గుండా జరుగుతుంది. దీని వల్ల ప్రపంచ ఆయిల్ ధరలు పెరిగాయి.
ఇంతకు ముందు ట్రంప్ ఇరాన్‌కు 48 గంటలు గడువు ఇచ్చి, జలసంధి తెరవకపోతే పవర్ ప్లాంట్లు ధ్వంసం చేస్తామని బెదిరించారు. తర్వాత బ్రిడ్జెస్ (వంతెనలు) తర్వాత ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లు లక్ష్యంగా చేసుకుంటామని చెప్పారు. ఇప్పుడు మంగళవారం నుంచి ఈ దాడులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఇరాన్ ఈ హెచ్చరికలకు తీవ్రంగా స్పందించింది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తామని, గల్ఫ్ దేశాల ఎనర్జీ సైట్లపై దాడులు చేస్తామని హెచ్చరించింది. కొన్ని గల్ఫ్ రిఫైనరీలపై ఇరాన్ దాడులు జరిగాయని నివేదికలు వచ్చాయి. ఇరాన్-ఇజ్రాయిల్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు గత నెల రోజులుగా కొనసాగుతున్నాయి.
Also Read:Hyderabad: హైదరాబాద్ లో MIM కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్
అమెరికా ఇప్పటికే ఇరాన్‌లోని కొన్ని బ్రిడ్జెస్‌ను ధ్వంసం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. ట్రంప్ ఇంకా ఎక్కువ ధ్వంసం చేయలేదని, ఇప్పుడు మరిన్ని లక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ హెచ్చరికలు ప్రపంచ వ్యాపారం, ఆయిల్ మార్కెట్లు, మధ్యప్రాచ్య ప్రాంత స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడి జరిగితే మిలియన్ల మంది విద్యుత్ సరఫరా నిలిచిపోయి, సాధారణ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Donald J. Trump Truth Social 04:05.26 08:03 AM EST
Tuesday will be Power Plant Day, and Bridge Day, all wrapped up in one, in Iran. There will be nothing like it!!! Open the Fuckin’ Strait, you crazy bastards, or you’ll be living in Hell – JUST WATCH! Praise be to Allah.…
— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) April 5, 2026
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!