Rohit Sharma Records: కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్.. తొలి మ్యాచ్‌లోనే ‘హిట్ మ్యాన్’ రికార్డుల వర్షం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై హార్దిక్ పాండ్యా జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ర్యాన్ రికెల్టన్ 43 బంతుల్లో 81 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 38 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు బాదడం విశేషం. దీంతో కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19.1 ఓవర్లలోనే ఛేదించింది. కాగా.. ఈ తొలి మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ పలు రికార్డులు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 50వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ (72), డేవిడ్ వార్నర్ (66), శిఖర్ ధావన్ (53) తర్వాత ఈ మైలురాయిని అందుకున్న నాలుగో బ్యాటర్‌గా అరుదైన క్లబ్‌లో చేరాడు. అంతేకాదు.. ముఖ్యంగా ఈ మ్యాచ్‌తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఒక భారీ రికార్డును బద్దలు కొట్టారు. ఐపీఎల్‌లో ప్రత్యర్థి జట్టుపై అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. కేకేఆర్‌పై ఇప్పటివరకు రోహిత్ 1161 పరుగులు (డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ తరపున కలిపి) సాధించి, పంజాబ్ కింగ్స్‌పై కోహ్లీ చేసిన 1159 పరుగుల రికార్డును అధిగమించాడు. ఛేజింగ్‌లో రోహిత్, ర్యాన్ రికెల్టన్ కలిసి మొదటి వికెట్‌కు 148 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్ చరిత్రలో ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం గమనార్హం.
READ MORE: KKR vs MI : ముంబై ఇండియన్స్ చారిత్రాత్మక విజయం.. 14 ఏళ్ల నిరీక్షణకు తెర.!
Also Read
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది పాండ్యా సేన. కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ బరిలోకి దిగింది. సీనియర్ ప్లేయర్ అజింక్యా రహానే (67), అంగ్‌క్రిష్ రఘువంశీ (51) అర్ధ సెంచరీల సాయంతో 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్యం చాలా పెద్దదే అయినప్పటికీ, రోహిత్ శర్మ తనదైన టైమింగ్, పవర్‌తో లక్ష్యాన్ని ఈజీగా ఛేజ్ చేశారు. చివరికి అనుకుల్ రాయ్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినా, అప్పటికే ముంబై ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించే స్థితికి చేరుకుంది.
తాజావార్తలు
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!