Site icon NTV Telugu

IPL 2025: ముంబైలోకి భారీ హిట్టర్.. రోహిత్ ప్లానేనా..?

Rohith Sharma

Rohith Sharma

ఐపీఎల్ రీషెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ఫారిన్ ప్లేయర్స్ ఆల్మోస్ట్ అందుబాటులోకి వచ్చారు. ముంబై ఆటగాడు విల్ జాక్స్ లీగ్ మ్యాచులకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ఆడనున్న నేపథ్యంలో జాక్స్ ప్లేఆప్స్ కి ముందే ఇంగ్లాండ్ వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్, బీసీసీఐ సడలించిన ఐపీఎల్ రిప్లేసెమెంట్ నిబంధనలను సరిగ్గా వాడుకుంది. విల్ జాక్స్ స్థానంలో భారీ హిట్టర్ ని బరిలోకి దించేందుకు రోహిత్ మాస్టర్ స్కెచ్ వేశాడు.

Also Read:Jammu Kashmir: పాక్‌ని పట్టించుకునేదే లేదు.. రెండు ప్రాజెక్టుల పనుల వేగం పెంచండి..

దానికి కెప్టెన్ హార్దిక్ కూడా ఒకే చెప్పాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం 12 మ్యాచులకు ముందు ఒక ఆటగాడిని రీప్లేస్ చేసుకోవాలి. అయితే తాజాగా బీసీసీఐ రీప్లేస్మెంట్ నిబంధనలను సడలించడంతో ముంబైకి కలిసొచ్చింది. ముంబై ఇప్పటికే 12 మ్యాచులు ఆడేసింది. సో .. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తే విల్ జాక్స్ స్థానంలో జానీ బెయిర్‌స్టో తాత్కాలికంగా ముంబై ఇండియన్స్‌లో చేరతాడు. ఇప్పటికే ముంబై జానీ బెయిర్‌స్టో చర్చలు జరిపింది. అయితే జానీ బెయిర్‌స్టో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుంచి NOC పొందితేనే అతను ప్లేఆఫ్ మ్యాచ్‌ల కోసం ముంబై ఇండియన్స్‌లో చేరడానికి వీలుంటుంది.

Also Read:Airtel: ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు ఉచితంగా ఫ్రాడ్‌ డిటెక్షన్‌ సదుపాయం..

2025 మెగా వేలంలో జానీ బెయిర్‌స్టో అమ్ముడుపోలేదు. పైగా 2024 జూన్ నుంచి ఇంగ్లాండ్ తరపున ఏ ఫార్మాట్‌లోనూ ఆడలేదు. ఈ పరిస్థితిలో ఈ ఐపీఎల్ అతనికి ఆర్ధికంగానూ ఉపయోగపడనుంది. జానీ బెయిర్‌స్టో ఇప్పటివరకు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. టోర్నీలో మొత్తం 50 మ్యాచ్‌లు ఆడాడు. 144.45 స్ట్రైక్ రేట్‌తో 1589 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి.

Exit mobile version