NTV Telugu Site icon

Robbery: నలుగురు దొంగలు.. నాలుగు నిమిషాలు.. 29 లక్షలు దోపిడి

Robbery

Robbery

నలుగురు దొంగలు.. నాలుగు నిమిషాలు.. 29 లక్షలు దోపిడి.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. హాలీవుడ్ సినిమా తరహాలో దోపిడీ జరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతం రావిరాలలో మరొకసారి ఏటీఎం దోపిడీ చోటుచేసుకుంది. నలుగురు దొంగలు.. నాలుగు నిమిషాలు 29 లక్షల రూపాయల డబ్బును ఎత్తుకొని పోయారు. ఏకంగా ఏటీఎం మెషిన్ కట్ చేసి అందులో ఉన్న 29 లక్షల రూపాయలు చోరీ చేశారు. సినిమా తరహాలో చేసిన ఈ చోరీ పైన ఇప్పుడు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. షిఫ్ట్ కారులో వచ్చిన నలుగురు దొంగలు వస్తూనే సీసీ కెమెరాలు కనపడకుండా స్ప్రే చేశారు. తర్వాత కేబుల్స్ కట్ చేశారు. నలుగురు దొంగలు నేరుగా ఏటీఎం సెంటర్లోకి చొరబడ్డారు. తమతో తెచ్చుకున్న కట్టర్స్ తో ఏటీఎం మిషన్ కట్ చేశారు. అందులో ఉన్న 29 లక్షల రూపాయలు నగదు ఎత్తుకొని పోయారు. అయితే సీసీ కెమెరాలు పర్యవేక్షణ సెంట్రల్ మానిటరింగ్ సిస్టం ప్రతి బ్యాంకుకు ఉంటుంది. బ్యాంకు అధికారులు నిద్రపోయి దొంగతనం జరిగిన నాలుగు గంటల తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే దొంగలు రాష్ట్రం దాటి పారిపోయి ఉంటారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసు ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అయితే దొంగలు ఎవరు అనేది ఇప్పటికీ తెలియదు.

దొంగలు తెలివి మీరి పోయారు. దొంగలను పసిగట్టే టెక్నాలజీకి సవాల్ విసురుతున్నారు. బరితెగించిన దొంగలు రెక్కి చేసి మరి డబ్బులను కొల్లగొడుతున్నారు. సీసీ కెమెరాలు, సైరన్‌లు ఉన్నాయన్న భయం కూడా లేకుండా వాటిని పని చేయకుండా చేసి ఏం చక్కా డబ్బులను కాజేసి జారుకున్నారు. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల రావిరాల ఎస్బీఐ ఏటిఎం సెంటర్లో చోటు చేసుకుంది. నలుగురు దొంగలు నాలుగు నిమిషాల్లో ఏటీఎం సెంటర్ కొల్లగొట్టి 30 లక్షల రూపాయలు చోరీ చేశారు. ఒక రోజు ముందు ప్లాన్ చేసుకొని రెక్కీ చేసి మరి దొంగలు రెచ్చిపోయారు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిరాల ఎస్బీఐ ఏటిఎం సెంటర్లో దోపిడీ దొంగలు పంజా విసిరారు. చోరీ జరిగిన తీరు పరిశీలిస్తే ప్రొఫెషనల్ దొంగల పనిగా పోలీసులు భావిస్తున్నారు. నలుగురు దొంగలు కలిసి నాలుగంటే కేవలం నాలుగు నిమిషాల్లోనే ఏటీఎం సెంటర్లో టాస్క్ కంప్లీట్ చేసి చోరీ ముగించారు. ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ చేసి 30లక్షల నగదుతో ఉడాయించారు. చోరీ జరిగిన తీరు పోలీసులను షాక్ గురిచేసింది. తెల్లవారు సుమారు 1:55 నిమిషాలకు ఓఆర్ఆర్ మీదుగా స్విఫ్ట్ కారులో రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎంకి చేరుకున్నారు. షిఫ్ట్ కారులో వచ్చిన నలుగురు దొంగలు ముఖాలకు బ్లూ కలర్ కవర్ మాస్క్ ధరించి ఎస్బీఐ సెంటర్లో బయట ఉన్న సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు.

Arani Srinivasulu: జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయండి.. ఎమ్మెల్యే పిలుపు

ఎస్బీఐ ఏటీఎంలోకి చొరబడ్డ దొంగలు వారి వెంట తెచ్చుకున్న కట్టర్, ఇనుప రాడ్ల సాయంతో ఏటీఎంను బద్దలు కొట్టి 30 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. కట్టర్ ఇనుపరడ్ల సహాయంతో గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంను బద్దలు కొట్టిన దొంగలు.. కేవలం 4 నిమిషాల్లో ఏటీఎంలో నుండి డబ్బును తీసుకొని చేతికి మట్టంట కుండా ఎస్కేప్ అయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ఘటన స్థలాని పరిశీలించారు. మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి నేతృత్వంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు ఆదిభట్ల పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుల కోసం నాలుగు పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమీపంలో ఉన్న కెమెరాలు పరిశీలించారు. పోలీసులు గస్తీ కస్తూనే ఉన్నా.. ఎస్బీఐ ఏటీఎం సెంటర్ లో జరిగిన చోరీ ఉదంతం స్థానికులను షాక్ గురిచేసింది. ఏటీఎం సెంటర్ సమీపంలో ఉన్న నైబర్స్ ఎలాంటి శబ్దం అనుమానం రాకుండా నలుగురు దొంగలు చోరీ చేయడంపై గ్రామస్తులు అవక్కయ్యారు.

పోలీసుల దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. వండర్ లా- ఓఆర్ఆర్ మార్గం నుండి ఎస్బీఐ ఏటిఎం సెంటర్ కి స్విఫ్ట్ కార్ లో నలుగురు దొంగలు ఎలా వచ్చారు. ఎటువైపు నుండి ఎక్సిట్ అయి వెళ్లారు.. పోలీసులు సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసారు. దొంగలు ర్యావిరాల గ్రామం నుండి చోరీ అనంతరం మళ్ళీ ఓఆర్ఆర్ మీదుగా వెళ్లిపోయినట్లు ఆధారాలు సేకరించారు. ఘటన అనంతరం పోలీసులు, క్లూస్ టీమ్స్ నేరగాళ్ల ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. చోరీ జరిగిన తీరు ప్రొఫెషనల్ దొంగల పనే అయి ఉండవచ్చని.. ఇతర రాష్ట్రాల ముఠా పనిగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఓఆర్ఆర్..
ఆయా చెక్ పోస్టులు, తెలంగాణ-ఆంధ్రా బోర్డర్స్ సరిహద్దుల్లో పోలీసులను అలెర్ట్ చేశారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నలుగురు దొంగల కోసం గాలిస్తున్నారు. దొంగలు చోరీ అనంతరం ఓఆర్ఆర్ మీదుగా వెళ్లిన ఎగ్జిట్ రూట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకు లభించిన ఫింగర్ ప్రింట్స్ గతంలో ఏటీఎం సెంటర్లో జరిగిన చోరీ కేస్ స్టడీ చేస్తున్నారు. బీహార్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ దొంగల ముఠాలపై పోలీస్ ఫోకస్ పెట్టారు. ఏ క్షణంలో అయినా దొంగలు పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.