NTV Telugu Site icon

Football Association : ఫుట్‌బాల్ అసోసియేష‌న్ ఆఫీసులో చోరీ

Robbery

Robbery

హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలోని తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేష‌న్ కార్యాల‌యంలో చోరీ జ‌రిగింది. ఈ విష‌యాన్ని ఫుట్‌బాల్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ జీపీ పాల్గుణ ధృవీక‌రించారు. సోమ‌వారం ఉద‌యం కార్యాల‌యం ఓపెన్ చేయ‌గా, వ‌స్తువుల‌న్నీ చెల్లాచెదురుగా ప‌డి ఉన్నాయ‌ని తెలిపారు. ఇక ట్రోఫిలు, ఆట‌గాళ్ల‌కు సంబంధించిన కిట్లు చోరీకి గురైన‌ట్లు పేర్కొన్నారు. రూ. 50 వేల విలువ చేసే ట్రోఫీలు, రూ. 10 వేల విలువ చేసే కిట్లు అదృశ్యమయ్యాయ‌ని చెప్పారు.

 

సోమవారం ఉద‌యం ఆఫీసును క్లీన్ చేసేందుకు వ‌చ్చిన ప‌ని వారు ఈ ఘ‌ట‌న‌ను గుర్తించి త‌న‌కు స‌మాచారం అందించార‌ని వెల్ల‌డించారు. తాను ఆఫీసుకు వ‌చ్చి చూసేస‌రికి ట్రోఫీలు, కిట్లు క‌న‌బ‌డ‌టం లేద‌ని తెలిపారు. అనంత‌రం సైఫాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌ని పేర్కొన్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఎల్బీ స్టేడియం వ‌ద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు.

Show comments