Road Mishap: మహబూబ్ నగర్ జిల్లా జాతీయ రహదారి 44 పై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జడ్చర్ల వద్ద సంభవించింది. ఈ ఘటనలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంట్ కారణంగా బస్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో వెంటనే ప్రయాణికులు బస్సులో నుంచి కిందికి దిగిపోయారు. దీనితో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. ఈ బస్సు జగన్ ట్రావెల్స్ కు సంబంధించిందిగా తెలుస్తోంది. ఇక బస్సు ఢీకొన్న లారీ యాసిడ్ లోడ్ తో వెళ్తున్నట్లుగా ప్రయాణికులు తెలిపారు. ఓ కారు దారి మధ్యలో అడ్డంగా రావడంతో ఈ ఘటన జరిగినట్లు బస్సులోని ప్రయాణికులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాన్ని నష్టం జరగలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
YS Jagan: నేడు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..!