Road Accident : జమ్మూ శ్రీనగర్ హైవే పై ఘోర ప్రమాదం… లోయలో పడి 10మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident : శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 10 మంది చనిపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్, రాంబన్ సివిల్ క్యూఆర్‌టి బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బృందం సహాయక చర్యలు ప్రారంభించింది. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ప్యాసింజర్ క్యాబ్ రాంబన్ ప్రాంతంలోని బ్యాటరీ చష్మా సమీపంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై లోతైన గుంటలో పడిపోయిందని చెబుతున్నారు. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న చాలా మంది ప్రయాణికులు మరణించే అవకాశం ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్, సివిల్ క్యూఆర్‌టి బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. తెల్లవారుజామున రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన బృందం, ఇప్పటివరకు 10 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. కానీ ఆ ప్రాంతం లోతుగా, చీకటిగా ఉంది. నిరంతరం వర్షాలు కురుస్తున్నాయి.
Read Also:BRS KTR: బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుతారు..
Also Read
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
ఈ ప్రమాదం గురించి తెల్లవారుజామున 1.15 గంటల సమయంలో సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. జమ్మూ నుంచి కాశ్మీర్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ట్యాక్సీ (తవేరా) జాతీయ రహదారి-44లోని బ్యాటరీ చష్మా సమీపంలో సుమారు 300 మీటర్ల లోతులో ఉన్న గోతిలో పడిపోయినట్లు సమాచారం. ఎస్‌హెచ్‌ఓ పిఎస్ రాంబన్, పోలీసు బృందం, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం, సివిల్ క్యూఆర్‌టి రాంబన్‌తో సహా సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు లోతైన గోతిలో 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నందున సహాయక చర్యలు ఇబ్బందిగా మారాయి.
#WATCH रामबन इलाके में बैटरी चश्मा के पास जम्मू-श्रीनगर राष्ट्रीय राजमार्ग पर एक यात्री टैक्सी गहरी खाई में गिर गई। पुलिस, SDRF और रामबन सिविल QRT मौके पर मौजूद हैं और बचाव अभियान जारी है: जम्मू-कश्मीर पुलिस pic.twitter.com/tzSYtMy1T5
— ANI_HindiNews (@AHindinews) March 29, 2024
Read Also:Seema Haider : తన పై భర్త కోర్టులో పిటిషన్.. దేనికైనా రె‘ఢీ’ అంటున్న సీమా హైదర్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లోయ నుండి వెలికితీసిన రెండు మృతదేహాలను జమ్మూలోని అంబ్ ఘోర్తా నివాసి పురబ్ సింగ్ కుమారుడు బల్వాన్ సింగ్‌గా గుర్తించారు. అతను కారు డ్రైవర్. మరొక వ్యక్తి బీహార్ చంపారన్ నివాసి విశ్వనాథ్ ముఖియా కుమారుడు విపిన్ ముఖియాగా గుర్తించారు. రాంబన్ రోడ్డు ప్రమాదంపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఘోర రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న అనంతరం డీసీ రాంబన్ బసీర్ ఉల్ హక్‌తో మాట్లాడానని, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.
తాజావార్తలు
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!