NTV Telugu Site icon

Road Accident: పశ్చిమ బెంగాల్‌లో ఘోరం.. అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు, ఐదుగురు మృతి

Road Accident

Road Accident

పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలోని రాష్ట్ర రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలు వాహనాలను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు మరణించగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పురూలియా ఎస్పీ అవిజిత్ బెనర్జీ తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు నిర్మాణం కోసం కాంక్రీట్‌ను తీసుకెళ్తున్న ట్రక్కు మొదట ఓ బైక్ను ఢీకొట్టగా.. బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారన్నారు.

Maneka Gandhi: వరుణ్‌గాంధీకి టికెట్ దక్కకపోవడంపై తల్లి ఏమన్నారంటే..!

ఈ క్రమంలో.. డ్రైవర్‌ను పట్టుకునేందుకు స్థానికులు ట్రక్కు వైపు పరుగులు తీయడంతో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. ఈ గందరగోళంలో.. త్రీవీలర్‌ను ఢీకొట్టాడు.. ఆ తర్వాత కొంతమంది పాదచారులను ఢీకొన్నాడని పోలీసులు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నితుడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సద్వారి మోడ్‌లో నివసించే కొందరు వ్యక్తులు అదే పోలీస్ స్టేషన్ పరిధిలోని వగర్దంగా గ్రామంలో ఒక వివాహ వేడుక నుండి ఆటోలో స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో.. భమురియా గ్రామ సమీపంలోని మలుపు వద్ద ట్రక్కు ఆటోను ఢీకొట్టిందన్నారు. దీంతో ఆటో డ్రైవర్‌తో సహా ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారని తెలిపారు. మృతుల్లో శ్యామపాడ్ మండల్ (74), భాగ్యవతి మండల్ (63), మృదుల్ మండల్ (45) ఉన్నారు. ఈ ఘటనలో మరొకరికి గాయాలయ్యాయని.. అతడిని నితుదియ బ్లాక్‌ ఆస్పత్రిలో చేర్చామని పోలీసులు తెలిపారు.

TSRTC: ఇక టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు బంద్.. ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు..

ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మొత్తం ఐదుగురు చనిపోగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ట్రక్కును వెంబడించి పర్వేలియా గ్రామ సమీపంలో బలవంతంగా ఆపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను విచారిస్తున్నారు.