Road Accident: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి సమీప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి కారు బోల్తా పడడంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో పెదమానాపురం గ్రామానికి చెందిన రౌతు ధనంజయ్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారు కూడా అదే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
Vijayawada: ఇంద్రకీలాద్రిపై నేటి నుండి మహా కుంభాభిషేక మహోత్సవాలు.. మూడు రోజులపాటు ఘనంగా వేడుకలు
సంఘటన సమయంలో ఉన్న వారు క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పెదమానాపురం గ్రామంలో బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు బందువులు చెబుతున్నారు.. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Ind vs Eng : ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. ఫైనల్‌లోకి టీమిండియా..
