నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. అందులో ఇటీవలే పెళ్లి అయిన ఓ మహిళ ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. నిర్మల్ జిల్లా కడెం మండలం పాండవ పూర్ బ్రిడ్జి వద్ద అదుపు తప్పి.. కారు బోల్తా కొట్టింది. అయితే… ఆ కారులో ప్రయాణిస్తున్న పెండ్లి కూతురు మౌనిక మరియు పెండ్లి కూతురు తండ్రి రాజాం అక్కడిక్కడే మృతి చెందారు. ఇక అటు ఈ ప్రమాదంలో పెండ్లి కొడుకుకు తీవ్ర గాయాలు అయ్యారు. ఇదే కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే.. ఈ ఘటన జరిగిన వెంటనే.. అక్కడే ఉన్న స్థానికులు..బాధితులను ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. కాగా…వీరిద్దరికీ రెండు రోజుల క్రితమే పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది.