Site icon NTV Telugu

America Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి

Road Accident

Road Accident

అమెరికాలోని అరిజోనాలోని లేక్ ప్లెసెంట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనగా.. ఈ ఘటనలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం రాత్రి ఈ ఇద్దరు తమ మిత్రులతో కలిసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటికి కారులో వస్తుండగా ఓ గుర్తు తెలియని వాహనం వీరి కారును బలంగా ఢీ కొట్టింది. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతులు నివేష్ ముక్కా (19), గౌతమ్ పార్సీ (19)గా గుర్తించారు. వారు అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులుగా నమోదు చేసుకున్నారు.

Janhvi Kapoor: తెలుగులో మరో ఆఫర్ ను పట్టేసిన జాన్వీ.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణానికి చెందిన డాక్టర్‌ స్వాతి, డాక్టర్‌ నవీన్‌ దంపతుల కుమారుడు నివేశ్‌, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని శివునిపల్లికి చెందిన స్వర్ణకారుడు పార్శి కమల్‌కుమార్‌, పద్మ దంపతుల కుమారుడు గౌతమ్‌కుమార్‌ అమెరికాలోని అరిజోనా స్టేట్‌ విశ్వవిద్యాలయంలో బీటెక్‌ సెకండ్ ఇయర్ చదువుతున్నారు.

Amit Shah: అలా చేయండి.. మమతా బెనర్జీ గుండాలను తలకిందులుగా వేలాడదీస్తాం..

పియోరియా పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 20న సాయంత్రం 6:18 గంటలకు స్టేట్ రూట్ 74కి ఉత్తరాన ఉన్న కాజిల్ హాట్ స్ప్రింగ్స్ రోడ్‌లో రెండు కార్లు ఢీకొన్నాయి. “వాహనాలు ఎలా ఢీకొన్నాయి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు” అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.మరోవైపు… ఈ ప్రమాదంలో ఇద్దరు కారు డ్రైవర్లకు కూడా గాయాలయ్యాయి. కాగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు. మరోవైపు.. విద్యార్థుల మృతదేహాలను స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు అమెరికా పోలీసులు తెలిపారు.

Exit mobile version