Road Accident: బర్త్‌డే పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు యువకులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: బర్త్ డే పార్టీకి వెళ్లారు.. ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.. కానీ, తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి.. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపారు నలుగురు యువకులు.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు యువకులు మృతి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించిగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
Read Also: Indian 2 : గ్రాండ్ గా ఆడియో లాంచ్ ప్లాన్.. అతిధులుగా రానున్న బడా స్టార్స్..?
Also Read
కాగా, మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్ పుట్టినరోజు సందర్భంగా.. ఎనిమిది మంది యువకులు యానం వెళ్లారు.. ఆదివారం రాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.. అర్ధరాత్రి వరకు యానాంలో ఫుల్లుగా మద్యం సేవించి.. ఆ తర్వాత ఆటోలో సొంత ఊరికి బయల్దేరారు.. అయితే, రాత్రి 12.30 గంటల సమయంలో అమలాపురం మండలం భట్నవిల్లిలో లారీని ఢీకొట్టింది ఆటో.. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు వదిలారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. వారికి చికిత్స నిమొత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఈ ప్రమాదంలో 1.సాపే నవీన్ (22) నగరం, 2. కొల్లాబత్తుల జతిన్ (26), 3. నల్లి నవీన్ కుమార్ (27) , 4. వల్లూరి అజయ్ (18) మృతిచెందినట్టుగా గుర్తించారు.. ఒక బర్త్‌డే వేడుక.. నాలుగు కుటుంబాల్లో విషాధాన్ని నింపినట్టు అయ్యింది.
తాజావార్తలు
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
-
Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం..
-
Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
-
Telangana Teachers: తెలంగాణ టీచర్లకు శుభవార్త..
-
Jr NTR: రాజకీయాల్లోకి ఎన్టీఆర్..అసలు విషయం ఇదే!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!