Indian 2 : గ్రాండ్ గా ఆడియో లాంచ్ ప్లాన్.. అతిధులుగా రానున్న బడా స్టార్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “.ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు .గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇండియన్ కు సీక్వెల్ గా ఈమూవీ తెరకెక్కింది.ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై మరింత ఆసక్తి పెంచేసింది.ఈ మూవీ లో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, బాబీ సింహా, మధుబాల, ప్రియా భవానీ శంకర్ వంటి తదితరురులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఇప్పటికే లాంఛ్ చేసిన ఇండియన్ 2 ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.ఇటీవలే మేకర్స్ షేర్ చేసిన కమల్ హాసన్ నయా లుక్ వైరల్ అవుతుంది . సేనాపతిగా డ్యుయల్ షేడ్స్‌లో కనిపిస్తూ కమల్ అదరగొట్టారు . ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించగా.. డేట్‌పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.ఇదిలా ఉంటే మే 16న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఇండియన్ 2 ఆడియో లాంఛ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. కాగా ఈవెంట్‌కు ఇద్దరు స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈవెంట్‌కు రాంచరణ్ మరియు రజినీకాంత్ గెస్టులుగా రానున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి వుంది.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు