RK Roja: తిరుమల లడ్డూ వివాదంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. తాజాగా మరోసారి ఈ వివాదంలో హాట్ కామెంట్లు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. సీఎం ఏమైనా మాట్లాడవచ్చన్న బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి వ్యాఖ్యలు సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.. బావ కళ్లలో ఆనందం కోసం కాకుండా.. భక్తుల కళ్లల్లో ఆనందం కోసం పని చేయాలి అంటూ సలహా ఇచ్చారు.. తిరుమల లడ్డూకు పరీక్షలు చేయలేదని సుప్రీం కోర్టులో కూటమి లాయరే అంగీకరించారన్న ఆమె.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడే మాటలు కోర్టులో ఎందుకు మాట్లాడటం లేదు..? అని నిలదీశారు.. మీరు బీజేపీ అధ్యక్షురాలా..? లేదా టీడీపీ అధ్యక్షురాలో అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు.
Read Also: IND vs BAN: రేసులో రోహిత్, సిరాజ్, జైస్వాల్.. ఇద్దరిని వరించిన అవార్డు!
ఇదేం సినిమా షూటింగ్ కాదని.. రోజుకో వేషం, పూటకొక మాట మాట్లాడుతూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే అధికారం మీకు లేదు..? అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు రోజా.. సుప్రీంకోర్ట వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనపై విచారణ చేపట్టకుండానే సీఎం విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు.. తప్పు చేశారు కాబట్టే.. పవన్ కల్యాణ్‌తో దేవుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయించాడని చెప్పుకొచ్చారు.. భిన్నమైన ప్రకటనలు చేసిన టీటీడీ ఈవో శ్యామలరావును కూడా విచారించాలని డిమాండ్ చేశారు.. అధికారంలో ఉండి ఆధారాలు లేకుండా వైఎస్ జగన్.. వైసీపీ లేకుండా చేయాలనే ఇలాంటి కుట్రలు చేశారంటూ ధ్వజమెత్తారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా..