RK Roja: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కేసు నందైన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు కారణమైన ఘటనకు సంబంధించిన వీడియోపై రోజా స్పందించారు. జగన్ కు వస్తున్న జనాదరణ చూసి తట్టుకోలేక అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ డైవెర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, కక్ష్య సాధించడంలో భాగామే ఈ కేసు పెట్టారంటూ ఆమె అన్నారు. జగన్ పై కేసు పెట్టడానికి ఒక ఫేక్ వీడియోను బయటకు వదిలారు. ఒక ఫేక్ వీడియోను వదిలి వైసీపీని భయపెట్టాలని చూస్తున్నారని ఆమె అన్నారు.
Read Also:Tragedy : కొత్త జీవితం మొదలై రెండు నెలలే.. వేధింపులతో నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్య..!
అయితే, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో.. ఫేక్ వీడియో అని, అది ఎక్కడికైనా వెళ్లి టెస్ట్ చేసుకోమనండి అంటూ పేర్కొన్నారు. 18 తేదిన ఘటనలో సింగయ్య మృతి ప్రమాదం జగన్ కారు వల్ల కాదని ఎస్పీ అన్నారని, కానీ 22తేదిన ఎస్పీ ఓ ఫేక్ విడియో బయటకు తెచ్చి జగన్ కారు గుద్దిందంటూ ఒక కట్టు కధ అల్లుతున్నారని పేర్కొన్నారు. నాలుగు రోజులు పాటు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది..? నిద్ర పోతుందా..? అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. పోలీసులు దగ్గర లేని వీడియో బయటకు ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు.
Read Also:Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!
ఆ వీడియో వెనుక చంద్రబాబు, లోకేష్, పవన్ ఉన్నారని, అధికారంలో ఉన్నారు కాబట్టి భయపెట్టి కేసులు పెడుతున్నారని రోజా మాట్లాడారు. ఒక వ్యక్తి పడిపొతే తొక్కించుకు వెళ్లేంత మూర్ఖుడు, గుండెలేని వ్యక్తి జగన్ కాదని, తారకరత్న చనిపోయిన పాదయాత్ర చేసినా వ్యక్తి లోకేష్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. గోదావరి పుష్కరాల్లో, సింహాచలం, తిరుపతి, కందూరులో వీళ్ళు ఎంత మంది చంపేశారు.. దానిపై చంద్రబాబు పై ఎన్ని కేసులు పెట్టాలి అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేసింది.
గేమ్ ఛేంజర్ సినిమా ఫంక్షన్ ఇద్దరు చనిపోయారు.. దానికి పవన్ పై కేసు పెట్టాలి. P4 పధకంలో మొదట చంద్రబాబు, లోకేష్, పవన్ భార్యలు వారి ఆస్తులను ప్రజలకు పంచాలి. అప్పుడు మిగిలిన వారికి కూడా నమ్మకం వస్తుందని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అబద్దాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్, పవన్ కళ్యాణ్ కు అలాగే 164మంది ఎమ్మెల్యేలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఆమె అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి తల్లికి వందనం లేకుండా మోసం చేశారని ఆమె అన్నారు.
