Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..

  • టీఎంసీలో మమతకు భారీ షాక్
  • 60 మంది ఎమ్మెల్యేల రీటబ్రతకే
  • స్పీకర్‌కు 58 మంది ఎమ్మెల్యేల లేఖ
  • ప్రతిపక్ష నేతగా రీటబ్రత..
Ritabrata Banerjee

Ritabrata Banerjee

Bengal Politics: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలో సంక్షోభం ముదిరింది. మమతా బెనర్జీ ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఓటమి తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా శోవన్‌దేబ్ చటోపాధ్యాయ నియామకంపై మెజారిటీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. మమత నిర్ణయంపై ధిక్కారం వినిపించారు. మమతా బెనర్జీ పిలిస్తే కనీసం సమావేశాలకు కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు హాజరయ్యే పరిస్థితి లేకుండా ఉంది.

ఇదిలా ఉంటే, తాజాగా 60 మంది ఎమ్మెల్యేల మద్దతుతో రీటబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. టీఎంసీకి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏకంగా 58 మంది రీటబ్రతకు మద్దతుగా స్పీకర్‌ రవీంద్రనాథ్ బోస్‌కు లేఖను అందించారు. దీంతో మమత నిర్ణయానికి వ్యతిరేకంగా రీటబ్రత ప్రతిపక్ష నేత అయ్యారు. తామే టీఎంసీ యొక్క అసలైన వర్గమని, రీటబ్రత బెనర్జీని ప్రతిపక్ష నాయకురాలిగా గుర్తించాలని ఆయనకు విన్నవించారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్, రీటబ్రత బెనర్జీని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని చెబుతూ, పార్టీ నుంచి రీటబ్రతను మమతా బెనర్జీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు బహిష్కరణకు గురైన రీటబ్రత వెనకే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం.

×
×
Ad