సండే వచ్చిందంటే చాలు ముక్కలేనిది ముద్ద దిగదు. అయితే గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు చికెన్ తినాలన్న ఆశ తీరకుండానే ఉండిపోతుంది. మరోవైపు.. పెరిగిన ధరలు చూసి నాన్ వెజ్ ప్రియులు షాక్ అవుతున్నాయి.
Read Also: Kavitha: కవితకు స్వల్ప ఊరట.. రౌస్ అవెన్యూ కోర్టు కీలక ఆదేశం
ఎండాకాలం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వారం తగ్గుతూ, మరొక వారం పెరుగుతున్నాయి. తాజాగా.. ధరలు కొండెక్కాయి. హైదరాబాద్ లో స్కిన్ లెస్ కేజీ ధర రూ. 300 ఉంది. పెరిగిన చికెన్ ధరలు చూసి నాన్ వెజ్ ప్రియులు అవాక్కు అవుతున్నారు. గత వారం కింద చికెన్ ధరలు కేజీ రూ. 220 నుంచి రూ. 240 వరకు ఉంది. వారం రోజుల్లో ధరలు ఇంతలా పెరగడంతో బాధపడుతున్నారు. అటు ఏపీలో కూడా చికెన్ ధరలు మండిపోతున్నాయి.
Read Also: Kavitha: కవితకు స్వల్ప ఊరట.. రౌస్ అవెన్యూ కోర్టు కీలక ఆదేశం
అయితే కోడిగుడ్ల ధరలు మాత్రం తగ్గుతూ వచ్చాయి. గత వారం రూ.7 పలికిన కోడిగుడ్డు.. ప్రస్తుతం రూ.5కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు పెరుగుతుండడంతో కోళ్లు చనిపోయే ప్రమాదం ఉందని, దీంతో కోళ్ల లభ్యత తగ్గి చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉందని ఫౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. కోళ్ల దాణా ధరలలో పెరుగుదల కారణంగా ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా పెరిగాయని అంటున్నారు.