UK Prime Minister: బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్.. విజయం తథ్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK Prime Minister: యూకే నూతన ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపడతారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఎంపికయ్యేందుకు మార్గం సుగమమైనట్లు కనిపిస్తోంది. ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కన్జర్వేటివ్ నాయకుడిగా తనకు చట్టసభ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ రిషి సునాక్ కంటే వెనకబడి ఉన్నానని భావించిన బోరిస్ జాన్సన్ పోటీ నుంచి వైదొలగడమే మేలని వెల్లడించారు. పోటీలో నుంచి కీలక వ్యక్తి వైదొలగడం.. మరో అభ్యర్థి పెన్నీ మోర్డాంట్‌కు మద్దతు అంతంత మాత్రంగానే ఉండడం వల్ల రిషి సునాక్ విజయానికి చేరువైనట్లేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఇవాళ స్పష్టం రానుండడంతో పాటు.. అన్ని కలిసొస్తే దీపావళి రోజునే రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి పోటీలో నిలిచేందుకు 100 మంది సభ్యుల మద్దతు అవసరం. రిషి సునాక్‌కు ఇప్పటికే 144 మంది సభ్యుల మద్దతు లభించింది. ఇప్పటివరకు బోరిస్ జాన్సన్‌కు 59 మంది సభ్యుల మద్దతు ఉండగా.. పోటీ నుంచి వైదొలగుతున్నట్లు వెల్లడించారు. ఇక మరో నాయకురాలు పెన్నీ మోర్డాంట్.. ఇప్పటివరకు కేవలం 23 మంది సభ్యుల మద్దతు మాత్రమే కూడగట్టారు. ఈ నేపథ్యంలో డెడ్‌లైన్ సమయానికి పోటీలో ఉండే సభ్యులపై స్పష్టత రానుంది. అందులో పార్టీ ఎంపీలు ఒక్కరికే పూర్తి మద్దతు ప్రకటిస్తే.. అందుకు రిషి సునాక్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కలిసి కట్టుగా పనిచేయాలని ఆశిస్తున్నామని బోరిస్ జాన్సన్ అన్నారు. అందుకే నా నామినేషన్‌ను ముందుకు తీసుకెళ్లట్లేదన్నారు. ఈ పోటీలో విజయం సాధించేవారికి పూర్తి మద్దతు ఉంటుందని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. అయినా తాను ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉంటూ దేశానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. బోరిస్ నిర్ణయం అనంతరం రిషి సునాక్ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. బ్రెగ్జిట్, కరోనా వ్యాక్సిన్ల పంపణీ, ఉక్రెయిన్ యుద్ధం సమయంలో మాజీ ప్రధాని దేశాన్ని ముందుకు నడిపిన తీరు అద్భుతమని కొనియాడారు.
Also Read
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
Kerala: కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం.. సాయంత్రం హైకోర్టు విచారణ..
భారత ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిసి సహ వ్యవస్థాపకుడైన నారాయణ మూర్తికి స్వయానా అల్లుడే ఈ రిషి సునాక్. ఆయన కూతురు అక్షతా మూర్తినే రిషి వివాహమాడారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్ విజయం సాధిస్తే ఇండియాకు కూడా ఎంతో సహకారంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!