Kantara A Legend Chapter 1: కాంతారా ప్రీక్వెల్ కోసం భారీ రెమ్యూనరేషన్ అందుకున్న రిషబ్ శెట్టి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంతారా మూవీతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అందుకున్నాడు దర్శకుడు రిషబ్ శెట్టి. ఈ సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.దీంతో రిషబ్ శెట్టి కాంతారా సినిమాకు ముందు జరిగిన కథను ప్రీక్వెల్ గా తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమాలో తానే స్వయంగా నటించి, దర్శకత్వం వహిస్తున్న రిషబ్ శెట్టి ఈ ప్రీక్వెల్ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం.కాంతారా ప్రీక్వెల్ కోసం రిషబ్ శెట్టి ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్న వార్తలు వస్తున్నాయి. గతేడాది రిలీజైన కాంతారా సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లు వసూలు చేసినా.. రిషబ్ శెట్టికి దక్కింది మాత్రం కేవలం రూ.4 కోట్ల రూపాయలు మాత్రమే..అయితే ఆ సినిమా తర్వాత ప్రీక్వెల్ పై అంచనాలు భారీగా పెరగడంతో అతని రెమ్యునరేషన్ కూడా 25 రెట్లు పెరిగి రూ.100 కోట్లకు చేరినట్లు సమాచారం.
ఈ రెమ్యునరేషన్ లో సగం అంటే రూ.50 కోట్లు అడ్వాన్స్ గా అతనికి అందినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక సినిమా హక్కులు అమ్మిన తర్వాత వచ్చే లాభాల్లో రిషబ్ శెట్టికి వాటా దక్కనుంది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి రైటర్ గా,డైరెక్టర్ గా అలాగే యాక్టర్ గా కూడా అన్నీ తానై ముందుండి నడిపిస్తున్నాడుకాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1 మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి ఓ టీజర్ కూడా రిలీజైంది. ఈ వీడియో వచ్చిన తర్వాత ఈ కాంతార ప్రీక్వెల్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఇందులో రిషబ్ ఫస్ట్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో రిషబ్ పూర్తి భిన్నమైన అవతారంలో కనిపించాడు. గతేడాది రిలీజైన కాంతారా మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.407.82 కోట్లు వసూలు చేసింది. అందులో కేవలం ఇండియాలోనే దాదాపు రూ.363.82 కోట్లు వచ్చాయి. ఇప్పుడు కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1 మూవీ దాదాపు ఏడు భాషల్లో రిలీజ్ కానుంది. కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ మరియు ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Also Read
- Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
- AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
- 12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
తాజావార్తలు
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!