Site icon NTV Telugu

Rishabh Pant: రిషబ్ పంత్‌ ఆరోగ్యంపై క్లారిటీ.. ప్లాస్టిక్‌ సర్జరీ చేసిన వైద్యులు

Rishabh Pant

Rishabh Pant

Rishabh Pant: రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన టీమిండియా క్రికెటర్‌ రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ఢిల్లీ క్రికెట్‌ బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుని సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ క్రికెట్ బోర్డు (డీడీసీఏ) వెల్లడించింది. రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న రిషబ్ పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ జరిగినట్లు ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్‌ శర్మ తెలిపారు.  ముఖం మీద అయిన గాయాలకు డెహ్రాడూన్‌లోని మ్యాక్స్‌ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ జరిగినట్లు పేర్కొన్నారు. తొలుత ఢిల్లీకి ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా తరలించాలని భావించినప్పటికీ.. మ్యాక్స్‌లోనే శస్త్రచికిత్సను నిర్వహించారు. ఈ మేరకు శ్యామ్‌ శర్మ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారత వికెట్ కీపర్-బ్యాటర్ శుక్రవారం ఉదయం తన మెర్సిడెస్ బెంజ్‌లో ఢిల్లీ నుండి డెహ్రాడూన్‌కు వెళ్తుండగా ఘోర ప్రమాదానికి గురయ్యాడు. డివైడర్‌ను ఢీకొట్టడంతో అతని కారు మంటల్లో చిక్కుకుంది. పంత్ తన కుడి మోకాలిలో లిగమెంట్ స్థానభ్రంశం కాగా.. అతని నుదిటిపై గాయాలైనప్పటికీ అదృష్టవశాత్తు కారు నుంచి బయట పడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

Mercedes Car: రిషబ్ పంత్ బతికున్నాడంటే “కారు” కూడా కారణమే.. ఆ కారు ప్రత్యేకతలివే..

“రిషబ్ పంత్ తన నుదిటి దగ్గర చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. 3 మంది సభ్యుల డీడీసీఏ బృందం డెహ్రాడూన్ చేరుకుంది. బీసీసీఐ మ్యాక్స్ హాస్పిటల్‌లోని డాక్టర్లతో, పంత్ కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం అతను నిలకడగా ఉన్నాడు. ప్రమాదం నుంచి బయటపడ్డాడు.” అని డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు. శ్యామ్ శర్మ కూడా క్రికెట్ స్టార్‌కు అందిస్తున్న చికిత్స పట్ల సంతృప్తి వ్యక్తం చేశా మెదడు, వెన్నెముకకు సంబంధించిన ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో ఎలాంటి సమస్య లేదని, అంతా సాధారణంగా ఉన్నట్లు తాజాగా వైద్యులు ప్రకటించారు. ప్రమాదానికి సంబంధించి సోషల్‌ మీడియాలో వచ్చిన సీసీ కెమెరాల్లో ఫుటేజీ ప్రకారం.. పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టిన క్షణాల్లోనే మంటలు అంటుకొన్నట్లు తెలుస్తోంది. అయితే హైవేలో ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు వెంటనే పంత్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించారు.

Exit mobile version