Site icon NTV Telugu

Rishabh Pant: అక్కడో ఫీల్డర్‌ను పెట్టు.. బంగ్లా కెప్టెన్‌తో రిషబ్ పంత్..(వీడియో)

Rishab Panth

Rishab Panth

Rishabh Pant: ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ఇండియా బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా భారీ ఆధిక్యంతో కొనసాగుతోంది. రెండవ రోజు ఆటమూసే సమయానికి భారత్ 81 పరుగులకు మూడు వికెట్లు నష్టపోయింది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్, గిల్ మూడో రోజు ఆటను కొనసాగించారు. మూడో రోజు మొదటి సెషన్ లో ఎలాంటి వికెట్ కోల్పోకుండా 376 పరుగులకు టీమిండియా స్కోర్ బోర్డ్ ను చేర్చారు. ఇక లంచ్ విరామం తర్వాత రిషబ్ పంత్ తన సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు గిల్ కూడా సెంచరీ దిశగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉండగా.. మొదటి సెషన్ లో రిషబ్ పంత్ బంగ్లాదేశ్ కెప్టెన్ మధ్యలో ఓ ఫన్నీ సన్నివేశం సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Virat Kohli: షకిబ్‌ బంతులపై కోహ్లీ కామెంట్స్ వైరల్..

తొలి సెషన్ లో రిషబ్ పంత్, గిల్ వికెట్ పడకుండా ఆడుతుండడంతో బంగ్లాదేశ్ టీం కాస్త డీలా పడిపోయినట్లుగా కనబడింది. అయితే., ఈ సమయంలో రిషబ్ పంత్ కాస్త సరదాగా బంగ్లాదేశ్ టీం ఫీల్డింగ్ లో మార్పులు చేయాలంటూ సూచించాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటోని పిలిచి లెగ్ సైడ్‌ లో ఒక ఫీల్డర్ను పెట్టాలంటూ అతనికి సూచించాడు. బాల్ ను ఎదుర్కోవడానికి బంగ్లాదేశ్ కెప్టెన్ వైపు తిరిగి.. హే.. అక్కడ పూర్తిగా ఖాళీగా ఉన్న లెగ్ సైడ్‌ ఇన్నర్ సర్కిల్ లో ఫీల్డర్ ఉంచాలంటూ సరదాగా తెలియజేశాడు. ఆ సమయంలో ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఉందని చూపిస్తూ తెలిపారు. దీంతో స్టేడియంలో ఉన్న అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలతో రెచ్చిపోయారు. ఇక విషయాన్ని గమనించిన బంగ్లాదేశ్ కెప్టెన్ కూడా సూచనలను గౌరవిస్తూ అక్కడ ఓ ఫీల్డర్ ను ఉంచాడు. దింతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version