Site icon NTV Telugu

Rishabh Pant: స్పెషల్ ట్రెడ్‌మిల్‌పై రిషబ్ పంత్ రన్నింగ్.. వీడియో వైరల్

Pant

Pant

టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది చివరిలో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై.. తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కారణంగా రిషబ్ పంత్ టీ20 ప్రపంచకప్‌, వరల్డ్ కప్ 2023లో ఆడలేకపోయాడు. అయితే నాసాలో శిక్షణ పొందుతున్న రిషబ్.. ట్రైనింగ్ సెషన్‌లో బాగా చెమటలు పట్టిస్తున్నాడు.

Read Also: Putin: 2030 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్..

అందుకు సంబంధించిన ఓ వీడియోను రిషబ్ పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోలో రిషబ్ పంత్ యాంటీ గ్రావిటీ ట్రెడ్‌మిల్‌పై పరుగెడుతున్నట్లు కనిపిస్తున్నాడు. అంతేకాకుండా.. ఈ వీడియో క్యాప్షన్‌లో షార్ట్‌కట్‌లు లేవు, పూర్తి హార్డ్ వర్క్ అని రాశాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ వీడియోపై అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ ద్వారా తమ స్పందనను తెలియజేస్తున్నారు.

Read Also: Congress: జగ్గారెడ్డి వర్సెస్ దామోదర రాజనర్సింహ.. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ

ఈ వీడియోలో రిషబ్ పంత్ నడుస్తున్న ట్రెడ్‌మిల్ అంతర్జాతీయ అథ్లెట్ల పునరావాసంలో ఉపయోగిస్తారు. అయితే.. నాసా సహకారంతో ఈ ప్రత్యేక ట్రెడ్‌మిల్‌ను తయారు చేశారు. వ్యోమగాములను సిద్ధం చేసేందుకు నాసా ఈ ట్రెడ్‌మిల్‌ను ఉపయోగించింది. నాసా తయారు చేసిన ఈ ట్రెడ్‌మిల్ ధర దాదాపు 4 నుంచి 7 కోట్ల ధర ఉంటుంది.

Exit mobile version