Site icon NTV Telugu

Rishabh Pant: గల్లీలో పిల్లలతో కలిసి గోళీలు ఆడుతున్న స్టార్ క్రికెటర్.. వీడియో వైరల్

Rishab

Rishab

భారత కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ అభిమానులకు ఇదొక శుభవార్త. డిసెంబర్ 2022లో కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్.. తొందరగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో పంత్ కోలుకుంటున్నాడు. ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. అయితే.. తను ఇటీవల వీధిలో పిల్లలతో కలిసి గోళీలు ఆడుతూ కనిపించాడు. పిల్లలతో కలిసి కింద కూర్చుంటూ గోళీలాట ఆడాడు. వారిలో కలిసి పోయి సీరియస్‍గా గోళీలకు గురి పెడుతూ ఆట కొనసాగించాడు. పిల్లలతో పోటీ పడుతూ ఆటలో లెక్కలు కూడా కట్టాడు రిషబ్ పంత్. తన స్కోరు ఎంత అని పిల్లలను అతడు అడగడం కూడా వీడియోలో ఉంది.

Swiggy: స్విగ్గీ, IRCTC మధ్య కీలక ఒప్పందం.. ఇకపై రైళ్లలో స్విగ్గీ డెలివరీలు..

ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో.. ఈసారి ఐపీఎల్ లో ఆడనున్నట్లు అభిమానులు అనుకుంటున్నారు. రిషబ్ పంత్.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పిల్లలతో తన వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో.. అతను తన ముఖాన్ని కర్చీఫ్ కట్టుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా.. తలపై టోపీ పెట్టుకున్నాడు. ఈ వీడియోను క్రికెట్ హ్యాండిల్ ‘@CricCrazyJohns’తో ‘X’లో కూడా పోస్ట్ చేశారు. దీనిని ఒక మిలియన్ కంటే ఎక్కువ సార్లు చూశారు. ఈ పోస్ట్‌పై యూజర్ల నుంచి అనేక స్పందనలు వస్తున్నాయి. స్టార్ అయ్యి ఇంత డౌన్​ టు ఎర్త్​ గా ఉన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో పంత్​ తను చిన్నానాటి రోజులను గుర్తుచేసుకున్నాడేమో అంటూ సరదాగా అంటున్నారు. తనని చూసి వారికి కూడా పాత రోజులు గుర్తొచ్చాయంటూ అభిప్రాయపడుతున్నారు.

Meenakshi Chaudhary: లక్కీ భాస్కర్ భార్య.. ఎంత లక్షణంగా ఉందో

Exit mobile version