NTV Telugu Site icon

Rishabh Pant: ఆ విషయంలో రికార్డ్ సృష్టించిన రిషబ్ పంత్..!

6.

6.

కారు యాక్సిడెంట్ తర్వాత దాదాపు 16 నెలల పాటు విశ్రాంతి తీసుకుని రికవర్ అయ్యి ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రెండు రికార్డులను నెలకొల్పాడు. ఇందులో భాగంగా మొదటగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున 3000 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు. శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ లక్నో పై ఈ ఘనత సాధించాడు.

Also Read: Fashion designer: ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ రాబర్టో కావల్లి కన్నుమూత

రిషబ్ పంత్ ఐపిఎల్ లో ఇప్పటివరకు 104 మ్యాచ్లలో 34 సగటుతో 3032 పరుగులు చేశాడు. దీంతోపాటు మూడు వేల పరుగులను అతి తక్కువ బంతుల్లో సాధించిన బ్యాటరుగా కూడా రిషబ్ పంత్ రికార్డుల ఎక్కాడు. ఈ ఘనతను రిషబ్ పంత్ 2028 బంతుల్లో పూర్తి చేశాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్ లో 6 మ్యాచ్ లలో 194 పరుగులు చేసి జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు రెండు అర్థ శతకాలు సాధించగా ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్థానంలో ఉన్నాడు.

Also Read: Sai Pallavi: వామ్మో.. సాయి పల్లవి రెమ్యూనరేషన్ ఒక్కసారిగా అంతపెంచిందా..?!

శుక్రవారంనాడు జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండ్ షో తో లక్నో సూపర్ జయింట్స్ పై ఆర్ వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా హ్యాట్రిక్ ఓటముల నుంచి తప్పించుకొని ఢిల్లీ విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన లక్నో 167 పరుగులు చేయగా.. దానిని ఢిల్లీ క్యాపిటల్స్ ఛేదనలో 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ 24 బంతుల్లో 41 పరుగులు చేసి తన సత్తా చాటాడు.