Rishabh Pant: బ్యాటింగ్ చేస్తుండగా తీవ్ర గాయం.. నడవలేని స్థితిలో రిషబ్ పంత్! వీడియో
- రిషబ్ పంత్‌కు తీవ్ర గాయం
- క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో పంత్‌కు గాయం
- నొప్పితో విలవిల్లాడిన పంత్
- నడవలేని స్థితిలో ఉన్న టీమిండియా వికెట్ కీపర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant Injury Viral Video: మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు తీవ్ర గాయం అయింది. మొదటి రోజు మూడో సెషన్లో బ్యాటింగ్ చేస్తుండగా అతడి కాలికి గాయం అయింది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో పంత్ స్వీప్ షాట్ ఆడాడు. బంతి ముందుగా బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి.. ఆపై పంత్ కుడి కాలు పాదానికి బలంగా తాకింది. దాంతో నొప్పితో విలవిల్లాడాడు. నొప్పి భరించలేక కాసేపు మైదానంలో పరుగెత్తాడు. ఆపై పంత్ తన షూ తీయగా.. రక్తం కారింది. బంతి తాకిన చోట వాపు కూడా వచ్చింది.
వెంటనే టీమిండియా ఫిజియో వచ్చి రిషబ్ పంత్‌కు చికిత్స చేశాడు. ఆ సమయంలో అతడు నొప్పితో విలవిల్లాడాడు. మైదానం నుంచి బయటికి తీసుకెళ్లే సమయంలో నడవలేని స్థితిలో ఉన్నాడు. దాంతో వాహనంలో డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. వాహనంలో మైదానం వీడుతున్న సమయంలో కూడా తీవ్ర నొప్పితో బాధపడ్డాడు. పంత్ గాయంకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాక.. రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. పంత్ గాయంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఈరోజు వికెట్స్ పడితే అతడు బ్యాటింగ్‌కు వస్తాడో లేదో చూడాలి.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Also Read: Today Astrology: గురువారం దినఫలాలు.. ఆ రాశి వారు జాగ్రత్త సుమీ!
రిషబ్ పంత్ మైదానాన్ని వీడిన కొద్ది సేపటికే సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ అనంతరం సాయి (61) పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో జడేజాకు శార్దూల్ ఠాకూర్ జతకలిశాడు. ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా మొదటి రోజును ముగించారు. 83 ఓవర్లలో భారత్ 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (19), శార్దూల్ ఠాకూర్ (19) క్రీజ్‌లో ఉన్నారు. రెండో రోజు ఈ ఇద్దరు భారీ పరుగులు చేయాల్సి ఉంది.
COMEBACK STRONG, RISHABH PANT. 🤞pic.twitter.com/eTNeOV1wI2
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 23, 2025
Hope nothing serious for Rishabh Pant pic.twitter.com/5EQfyGYzcM pic.twitter.com/r9P4TdPntp
— ᴅʜᴏɴɪ ʀᴀɪɴᴀ ᴛᴇᴀᴍ (@DhoniRainaTeam) July 23, 2025
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!