Rishabh Pant: న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ రేపటి (జనవరి 11న) నుంచి ప్రారంభం కానుంది. కానీ ఈ టైంలో టీమిండియా అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ నెట్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు. పలు నివేదికల ప్రకారం.. ప్రాక్టీస్ టైంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, పంత్ నడుము పైన (నడుము దగ్గర) దెబ్బ తగిలినట్లు సమాచారం.
READ ALSO: Andhra Pradesh Census: ఏపీలో జన గణన కసరత్తు ప్రారంభం.. అడ్డుకుంటే జైలుకే..!
రిషబ్ పంత్ దాదాపు 50 నిమిషాల పాటు నెట్స్‌లో శ్రద్ధగా ప్రాక్టీస్ చేశాడు. ఆ టైంలో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నా పంత్‌కు అనుకోకుండా ఒక బంతి నడుము దగ్గర తీవ్రంగా తగిలింది. ఇప్పటి వరకు గాయం తీవ్రతపై అధికారిక ప్రకటన రానప్పటికీ, జట్టు యాజమాన్యం అతని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. సిరీస్‌కు ముందు ఆటగాళ్ళు తమ ఫిట్‌నెస్, ఫామ్‌ను నిరూపించుకుంటున్న టైంలో ఈ సంఘటన జరిగింది.
నిజానికి టీమిండియాలో రిషబ్ పంత్ కీలక ఆటగాడు. జట్టులో పంత్, కెఎల్ రాహుల్ తర్వాత రెండవ వికెట్ కీపర్‌గా ఉన్నాడు. ఈ గాయం జట్టుకు పెద్ద తలనొప్పిగా మారవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా ఇప్పుడు పంత్ కోలుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. గాయం తీవ్రంగా లేకపోతే, రిషబ్ త్వరలో జట్టులోకి తిరిగి రావచ్చని సమాచారం. కానీ ఒకవేళ విశ్రాంతి అవసరమైతే, పంత్ ఫస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ వడోదరలో జరగనుంది. పంత్ గాయం గురించి జట్టు యాజమాన్యం త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని అందరూ భావిస్తున్నారు.
ఇంగ్లాండ్ పర్యటనలో కూడా..
గతంలో పంత్ 2025 ఇంగ్లాండ్ పర్యటనలో కూడా గాయాల బారినపడ్డాడు. ఈ పర్యటనలో పంత్ లార్డ్స్ టెస్ట్ సమయంలో వేలికి గాయం కావడంతో, అలాగే మాంచెస్టర్ టెస్ట్ మొదటి రోజున కుడి పాదానికి తీవ్ర గాయం అయింది. ఆ టైంలో పంత్‌ను గోల్ఫ్ కార్ట్ ద్వారా మైదానం నుంచి బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. స్కాన్లలో కాలి బొటనవేలు విరిగినట్లు తేలింది, దీని వల్ల పంత్ కొంతకాలం క్రికెట్ మైదానానికి దూరంగా కూడా ఉన్నాడు. తాజాగా పంత్ మళ్లీ గాయం బారిన పడటం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Bangladesh: బంగ్లాదేశ్ రాజకీయాల్లో సరికొత్త శకం.. బీఎన్‌పీకి కొత్త చీఫ్
