NTV Telugu Site icon

Rishabh Pant Fine: రిషబ్ పంత్‌కు భారీ జరిమానా.. రిపీట్ అయితే అంతే సంగతులు!

Rishabh Pant Fine

Rishabh Pant Fine

Rishabh Pant Fined Rs 12 Lakh: ఆదివారం విశాఖలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాదించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీకి ఇదే తొలి విషయం. ఐపీఎల్ 17వ సీజన్‌లో బోణి చేసిన ఢిల్లీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ కెప్టెన్‌ రిషబ్ పంత్‌కు భారీ జరిమానా పడింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్‌ నిర్వాహకులు పంత్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత సమయంలో పూర్తి ఓవర్ల కోటా పూర్తి చేయనందున రిషబ్ పంత్‌కు ఫైన్‌ వేశారు. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఢిల్లీ చేసిన తొలి తప్పిదం కాబట్టి రూ. 12 లక్షల జరిమానాతో సరిపెట్టారు. ఐపీఎల్‌ 2024లో ఫైన్‌ బారిన పడ్డ రెండో కెప్టెన్‌ పంత్‌. ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు కారణంగా గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్ శుబ్‌మన్‌ గిల్‌కు జరిమానా విధించారు.

Also Read: Sakshi Dhoni: హాయ్ మహీ.. మ్యాచ్‌ ఓడిపోయామని గ్రహించలేదు!

ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. మొదటిసారి స్లో ఓవర్‌ రేటు నమోదు చేస్తే కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా పడుతుంది. ఈ సీజన్‌లో ఇదే రెండోసారి రిపీట్ అయితే కెప్టెన్‌కు రూ. 24 లక్షలు ఫైన్‌, జట్టులోని ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు. ఇక మూడోసారి పునరావృతమైతే కెప్టెన్‌కు 30 లక్షల జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధించబడుతుంది. అంతేకాకుండా ఆటగాళ్లకు రూ.12 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానా విధించబడుతుంది.