Urvashi Rautela : హీరోయిన్ పై ఫ్యాన్స్ ఫైర్.. వెంటపడొద్దంటూ హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urvashi Rautela : బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కారణం ఆమె ఆస్ట్రేలియాకు వెళ్తుండడమే. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ మరికొన్ని రోజుల్లో ఇక్కడ ప్రారంభం కానుంది. తాజాగా ఆమె చేసి ఓ పోస్ట్ ప్రస్తుతం మళ్లీ వైరల్అయింది. ఆమె ఇచ్చిన క్యాప్షన్ కు ఫ్యాన్స్ రిషబ్ పంత్ ను ముడిపెడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్, బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా గతంలో ప్రేమలో మునిగి తేలారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇద్దరూ చాన్నాళ్లు డేటింగ్ చేశారని గుసగుసలు వినిపించాయి. అయితే, ఊర్వశీతో తనకు ఏ సంబంధం లేదని పంత్ స్పష్టం చేశాడు. తన ప్రేయసి ఈషా నేగిని ప్రపంచానికి పరిచయం చేశాడు. అయినా పంత్ ను ఊర్వశీ వదలడం లేదు. ఆర్ పీ అని పరోక్షంగా అతడిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తోంది. ఆర్ పీ తన కోసం ఢిల్లీ వచ్చి హోటల్ లాబీలో రాత్రంతా ఎదురు చూశాడని ఓ ఇంటర్వ్వూలో కామెంట్ చేసింది. దీనిపై పంత్ ఘాటుగానే స్పందించాడు. కొందరు చీప్ పబ్లిసిటీ కోసం ఇలా మాట్లాడుతుంటారని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఓ దశలో ‘అక్కా.. నన్ను వదిలెయ్’ అని కూడా అన్నాడు.
Also Read
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
Read Also: PV Sindhu : ‘జిగిల్ జిగేల్’ అనిపిస్తోన్న పీవీ సింధూ
వీరిద్దరూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ నెటింట్లో హాట్‌టాపిక్‌గా మారారు. అతను ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షం అవుతోంది. మొన్న ఆసియా కప్ జరిగిన దుబాయ్ స్టేడియంలో కనిపించిన ఊర్వశీ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన పంత్ ను అనుసరిచింది. ఆస్ట్రేలియా వెళ్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేను నా ప్రేమను అనుసరిస్తున్నా.. అది నన్ను ఆస్ట్రేలియా తీసుకెళ్తోందని విమానంలో దిగిన ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ విషయంపై క్రికెట్ అభిమానులు ఊర్వశిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఓ అబ్బాయి మహిళా క్రికెటర్ వెంట పడితే ఈ సమాజం ఊరుకునేదా అని ప్రశ్నిస్తున్నారు. పంత్ వద్దంటున్నా ఊర్వశీ ఓ సైకోలా అతడిని వెంబడిస్తోందని దుయ్యబట్టారు. కానీ, వీటిని బాలీవుడ్ నటి అస్సలు పట్టించుకోవడం లేదు. ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత లెహెంగాలో దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి రౌతేలా.. ‘తనను ఎలా మరచిపోగలను. మరణం మనిషికి వస్తుంది. మనసుకు కాదు’ అని మరో పోస్ట్ చేసింది. అయితే, దీపావళి వేడుకకు సంబంధించి ఓ ఈవెంట్లో పాల్గొనేందుకే ఊర్వశీ ఆస్ట్రేలియా వెళ్లిందన్న వార్తలు వస్తున్నాయి.
I thought only I lost my self respect in love Then i saw urvashi rautela😭#UrvashiRautela pic.twitter.com/kjw6qtL1Mz
— ADÎTI💫💖 (@ADTI07) October 9, 2022
తాజావార్తలు
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!