NTV Telugu Site icon

Rishabh Pant: ధోనీ రికార్డును సమం చేసిన టీమిండియా వికెట్ కీపర్..

Pant

Pant

బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన తొలి టెస్టులో భారత డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ మరో అరుదైన ఘనత సాధించాడు. 638 రోజుల తర్వాత అంటే.. అంటే 21 నెలల తర్వాత టెస్ట్ క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన పంత్.. బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్‌లో శతకంతో దుమ్ము రేపాడు. భారత్‌ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో 128 బంతుల్లో 109 పరుగులు చేసిన పంత్.. భారత్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా నిలిచాడు. దీంతో.. మాజీ కెప్టెన్, దిగ్గజం ఎంఎస్ ధోనీ రికార్డును పంత్ ఇప్పుడు సమం చేశాడు. 90 టెస్టుల్లో ధోనీ ఇప్పటివరకూ ఆరు టెస్టు సెంచరీలు చేయగా.. పంత్ కేవలం 34వ మ్యాచ్‍లోనే ఆరో సెంచరీలు చేశాడు. మరో టెస్టు సెంచరీ చేస్తే పంత్, ధోనీ రికార్డ్‌ను బ్రేక్ చేస్తాడు. ఈ ఇద్దరి తర్వాత.. మూడు టెస్టు సెంచరీలు సాధించిన వృద్ధిమాన్ సాహా మూడో స్థానంలో ఉన్నాడు.

Read Also: IND vs BAN: మూడో రోజు ముగిసిన ఆట.. విజయం ముంగిట భారత్

డబ్ల్యూటీసీలో నెంబర్ వన్:
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో పంత్ రారాజుగా నిలిచాడు. పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్, బంగ్లాదేశ్‌కు చెందిన లిటన్ దాస్‌లను ఓడించి నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇద్దరూ సంయుక్తంగా రెండో స్థానానికి పడిపోయారు. డబ్ల్యూటీసీలో వీరిద్దరి ఖాతాలో ఒక్కో సెంచరీ ఉంది. కాగా.. పంత్ నాలుగు సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్ (2) మూడో స్థానంలో ఉన్నాడు.