NTV Telugu Site icon

Rishabh Pant: ఏంటి పంత్.. నీలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే..

Rishab Pant Irfan Patan 3

Rishab Pant Irfan Patan 3

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2024లో జట్టు విజయాలతో పాటు బ్యాట్స్‌మెన్‌గా పంత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను ఆడిన 12 గేమ్‌ లలో 413 పరుగులను 156 స్ట్రైక్‌ రేటుతో సాధించాడు. రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ముగిసే వరకు ఉండి తన జట్టుకు భారీ పరుగులు అందించడానికి ప్రయత్నిస్తున్నాడు. గాయం నుంచి తిరిగి వచ్చిన డీసీ కెప్టెన్.. డిఫెన్స్ లోనే కాకుండా అటాక్ లోనూ అద్భుతంగా రాణించాడు. అతను వికెట్ వెనుకల కూడా స్టంపింగ్స్, రనౌట్స్​తో ఆకట్టుకున్నాడు. అలాంటోడు ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తాడు. ఇక ఇందుకు సంబంధించి గురించి చూద్దాం..

Also Read: Double iSmart Update: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. ఈసారి ఇస్మార్ట్‌ మ్యాడ్‌నెస్‌!

ఇక పంత్ బ్యాట్ పట్టుకున్నాడా.. బౌలర్ ఎవరనేది అనవసరం., పిచ్చకొట్టుడు కొట్టడం అతడికి అలవాటుగా మారింది. అలంటి వ్యక్తి ఇప్పుడు బౌలర్ అవతార్ పొందాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం తమ తదుపరి గేమ్‌లో ఆర్సీబీ తో తలపడుతుంది. కాగా, ఆ జట్టు ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇకపోతే పంత్ కూడా ఈ నెట్స్​ లో చెమటలు చిందించాడు. ఇకపోతే సరదాగా.. అతను మాజీ భారత ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పర్సన్ పాత్రను పోషించాడు. అచ్చం పఠాన్ బౌలింగ్ యాక్షన్ ని దింపేసాడు.

Also Read: Gautam Gambhir: అలాంటి ఓనర్‌ ఉండటం నా అదృష్టం: గంభీర్‌

బౌలింగ్ చేస్తున్నప్పుడు పఠాన్ జంప్ చేసినట్లే, పంత్ కూడా పైకి జంప్ చేసి తన ఎడమ చేతిని ముందుకు కదిలిస్తూ బౌలింగ్ చేశాడు. అతని ముఖ ఎక్స్‌ప్రెషన్‌ని కూడా అలాగే పోలి ఉండేలా చూసుకున్నాను. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు.. సరదా కోసం ఇలా చేశారా..? లేక మ్యాచ్ లో బౌలింగ్ చేసేందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు అన్నారు.

Show comments