‘కాంతార: చాప్టర్ 1’తో రిషబ్ శెట్టి భారత సినీ పరిశ్రమలో తన సత్తా మరోసారి రుజువు చేసుకున్నారు. దాదాపు రెండున్నరేళ్ల పాటు ప్రతీ ఫ్రేమ్‌పై పర్ఫెక్షన్ కోసం ఎంత కష‍్టపడ్డారో ఆయన ఇంటర్వ్యూల్లో చెప్పినా, సినిమా చూసిన ప్రేక్షకులు మరింత బలంగా అర్ధం అయింది. గత నెల విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని అందుకొని, ఈ ఏడాది దేశవ్యాప్తంగా వచ్చిన సినిమాల్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. సినిమా విజయంతో రిషబ్ శెట్టి ఫ్యామిలీతో, స్నేహితులతో, టీమ్‌తో రిలాక్స్ అవుతూ, సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మరో వైపు ఆయన తర్వాతి సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఏ జనర్‌లో ఉంటుంది? అన్న చర్చలు సోషల్ మీడియాలో పెద్ద హీట్‌గా మారాయి. రిషబ్ శెట్టి స్థాయిలో ఉన్న దర్శక–నటుడు తరువాత ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే అభిమానులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ కూడా బాగా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పుడు ఆ సస్పెన్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ బజ్.. ?
రిషబ్ శెట్టి జనవరి మొదటి వారం నుంచే తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నారట. ఈ చిత్రాన్ని ఎక్స్‌పెరిమెంటల్ కాన్సెప్ట్‌లతో ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. జనవరి నుంచి మే వరకు ఐదు నెలల పాటు రిషబ్ శెట్టితో కాంటిన్యూస్ షూట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంటే ఈ సినిమా భారీ విజువల్ స్కేల్‌పై, నాన్–స్టాప్ షెడ్యూల్‌లతో తయారుకాబోతోందని స్పష్టమవుతోంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి ఆంజనేయ స్వామి పాత్రలో కనిపించనున్నారని తెలిసిన తర్వాత అభిమానుల్లో హైప్ రెట్టింపు అయింది. అంతేకాకుండా పవర్‌ఫుల్ డైలాగ్స్ కోసం ప్రసిద్ధి చెందిన సాయిమాధవ్ బుర్రా ఈ సినిమా కోసం సంభాషణలు రాస్తుండటం మరో పెద్ద హైలైట్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని పాన్–ఇండియా బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘కాంతార’తో ఒక వింత మాయాజాలాన్ని సృష్టించిన రిషబ్ శెట్టి, ఇప్పుడు ‘జై హనుమాన్’లో ఏ స్థాయి విజయం అందుకుంటారో చూడాలి.