Site icon NTV Telugu

Rinku Singh Virat Kohli: ‘ఈ బ్యాట్ విరిగింది.. ఇంకో బ్యాట్ ఇయ్యి ప్లిజ్’.. వీడియో వైరల్..

Virat Kohli

Virat Kohli

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా నేడు రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు, కలకత్తా నైట్ రైడర్స్ మధ్య 2:30 గంటలకు మ్యాచ్ మొదలు కాబోతోంది. ఇది ఇలా ఉంటే రెండు జట్ల ఆటగాళ్లు వారి చర్యలతో ఆఫ్ ఫీల్డ్ లో కూడా వారి అభిమానులను అలరిస్తున్నారు. ఈ మ్యాచ్ జరగక ముందు ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.

Also Read: Israel: ఇజ్రాయెల్ మిలటరీ బెటాలియన్‌పై అమెరికా ఆంక్షలు.. ఆగ్రహించిన నెతన్యాహు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీ, కోల్కత్తా డాషింగ్ బ్యాట్స్మెన్ రింకు సింగ్ మధ్య చిన్నపాటి సంఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా మొదటగా రింకు సింగ్.. విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్లి భయ్యా., ఇంకో బ్యాట్ ఇవ్వవా అంటూ అడగడం అభిమానులను అలరించింది. ఇదివరకు కోహ్లీ రింకుకు బ్యాట్ ను బహుమతిగా ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రాక్టీస్ స్టేషన్లో ఆ బ్యాట్ తో స్పిన్నర్లను ఎదుర్కొనే క్రమంలో బ్యాట్ విరిగిపోయిందంటూ దాంతో తనకి మరో బ్యాట్ ఇవ్వాల్సిందంటూ కోహ్లీ దగ్గరకు వచ్చి రింకు సింగ్ బ్యాట్ ఇవ్వవా అంటూ అడిగాడు.

Also Read: Thalapathy Vijay: స్టార్ హీరో విజయ్‌పై కేసు నమోదు!

దానికి సమాధానంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. అయితే నేనేం చేయాలి ఇప్పుడు నాకు ఎలాంటి సమాచారం అక్కర్లేదని చెప్పడంతో రింకూ సింగ్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. దాంతో రింకూ వెంటనే ఇంకో బ్యాట్ఇవ్వు ఈసారి విరగొట్టను అంటూ కోహ్లీని అడిగాడు. ఆ తర్వాత కొన్ని ఇంకో రింకూను ఆటపాటిస్తూ.. ఇంకో బ్యాట్ ఇస్తే తాను టోర్నమెంట్ తర్వాత దశలో మొదటికి మోసం వస్తుంది అంటూ ఇంకో బ్యాట్ ఇవ్వానని అంటూ మాట్లాడాడు. దాంతో రింకూ ఏం చేయకుండా తిరిగి వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో కోల్కత్తా నైట్ రైడర్స్ అధికారిక ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version