RIL Investments: వచ్చే 4 ఏళ్లలో రూ.75 వేల కోట్ల పెట్టుబడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RIL Investments: రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వచ్చే నాలుగేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో 75 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా కొత్తగా లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించనుంది. ఈ పెట్టుబడులు.. ఈ ఉద్యోగాలు.. టెలికం, రిటైల్ మరియు రెనివబుల్ బిజినెస్‌లలో అందుబాటులోకి రానున్నాయి. రిలయెన్స్ ఇప్పటికే యూపీలో 50 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. తద్వారా 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది.
read more: Loss For Life Insurers: అధిక ప్రీమియం ప్రొడక్టులపై పన్నుల ప్రభావం
Also Read
- Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్‌లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్‌లో షికారు..!
ఇప్పుడు రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో ఒకటి.. జియో స్కూల్ కాగా రెండోది.. జియో ఏఐ డాక్టర్. ఈ రెండు కార్యక్రమాలతో రాష్ట్రంలోని చిన్న పట్టణాలు మరియు గ్రామాల్లో ఆరోగ్య రంగాన్ని మరియు విద్యా రంగాన్ని బలోపేతం చేయనుంది. వీటితోపాటు 10 గిగా వాట్ల సామర్థ్యంతో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కేంద్రాన్ని మరియు ప్రతిష్టాత్మకమైన నూతన బయో ఎనర్జీ బిజినెస్‌ను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ విషయాలను రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. లక్నోలో జరుగుతున్న ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో వెల్లడించారు. అర్బన్ ఇండియా, రూరల్ భారత్ అనే భేదాలు చెరిగిపోతున్నాయని చెప్పారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు ప్రపంచంలో ఎవరూ ప్రశ్నించలేనంత పటిష్ట స్థితిలో ఉన్నాయని తెలిపారు. ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు దోహదపడేలా కొత్త బడ్జెట్ ఉందని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పురోగతికి రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆలోచనతో మనసు పెట్టి పనిచేసే విధానం ఇకపైనా కొనసాగుతుందని ముఖేష్ అంబానీ భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్‌లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్‌లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!