Richest People in Hyderabad: హైదరాబాదులో అత్యంత ధనవంతుల జాబితా విడుదల అయ్యింది. ఈ లిస్ట్ లో దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి కుటుంబం సుమారు రూ.91,100 కోట్ల నెట్ వర్త్తో హైదరాబాద్‌లోనే అత్యంత రిచెస్ట్ పర్సన్ గా ఉన్నారు. ఆ తర్వాత రెండవ స్థానంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (MEIL)కు చెందిన పిచ్చి రెడ్డి రూ.42,650 కోట్లు, మూడవస్థానంలో పి.వి. కృష్ణ రెడ్డి రూ.41,810 కోట్లు, నాలుగవ స్థానంలో హెటెరో ల్యాబ్స్‌కు చెందిన బి. పార్థసారధి రెడ్డి రూ.39,030 కోట్లు, ఐదవ స్థానంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు చెందిన కే. సతీష్ రెడ్డి కుటుంబం రూ.39,000 కోట్లు, 6వ స్థానంలో రూ.35,000 కోట్లతో ఆరోబిందో ఫార్మాకు చెందిన పి.వి. రామ్‌ప్రసాద్ రెడ్డి, బయాలజికల్ ఈ సంస్థను నడిపిస్తున్న మహిమ దత్ల ఉన్నారు.
MLA Defection Case: తేలనున్న తెలంగాణ పిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. నేడు సుప్రీం కోర్టులో విచారణ..!
ఆ తర్వాత 7వ స్థానంలో సోలార్ ఎనర్జీ రంగంలో ప్రీమియర్ ఎనర్జీస్‌కు చెందిన సురేందర్ సలూజా కుటుంబం, 8వ స్థానంలో రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన జూపల్లి రామేశ్వర్ రావు ఉండగా.. తరువాతి స్థానాల్లో అపర్ణ కన్స్ట్రక్షన్స్కు చెందిన సుబ్రమణ్యం రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి నిలిచారు. మొత్తంగా చూస్తే హైదరాబాద్‌లో ధనికులు ఎక్కువగా ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, సోలార్ ఎనర్జీ రంగాల నుంచి ఎదిగినవారే ఉన్నారు. అంతేకాదు తాజా అంచనాల ప్రకారం హైదరాబాద్‌లో రూ.1,000 కోట్లు పైగా ఆస్తులు కలిగిన వారు 100 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది దేశంలో ముంబై, ఢిల్లీ తర్వాత మూడో స్థానంలో హైదరాబాద్ నిలవడం విశేషం.