RGV : ఒకప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ అంటే ఆర్జీవీనే అని ప్రతి ఒక్కరు చెబుతుంటారు. గతంలో శివ, రంగీలా, సర్కార్ వంటి సినిమాలు కేరాఫ్ అడ్రస్‌లుగా నిలిచాయి. అలాంటి ఆర్జీవీ ఇప్పుడు మాత్రం తనకి ఇష్టం వచ్చినట్లు సినిమాలు చేసుకుంటున్నాడు. కానీ ఆర్జీవీని ఇన్సిరేషన్ గా తీసుకుని ఎంతోమంది సినీ పరిశ్రమలోకి డైరెక్టర్లు అవ్వాలని వచ్చారు. ప్రస్తుతం ఆర్జీవీ నుంచి సినిమాలు వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మినిమమ్ కలెక్షన్స్ కూడా రావని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన సినిమా అసలు థియేటర్లోకి ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు వెళ్లిందో తెలియని పరిస్థితి నెలకొంది.
Read Also:Hyderabad Crime: ఆర్‌ఎంపీ వైద్యుడి భార్య దారుణ హత్య
అయినా ఇప్పటికి చాలా మంది ఆర్జీవీ అభిమానులు ఉన్నారు. సినీ పరిశ్రమలో కూడా చాలామంది టెక్నిషియన్స్ ఆర్జీవీ దాసులే. అందులో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఒకరు. తీసిన మూడు సినిమాలతోనే సందీప్ వంగా స్టార్ డైరెక్టర్ లెవల్ కు ఎదిగారు. రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి తీసిన యానిమల్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఐఫా వేడుకల్లో యానిమల్ సినిమా బెస్ట్ ఫిలిం, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ నెగిటివ్ రోల్, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ డిజైన్.. ఇన్ని విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది.
Sirrrrrrr @imvangasandeep I now want to LEARN film making from YOU and I SWEAR this on Mia Malkova, Dawood Ibrahim ,Ayn Rand and YOU pic.twitter.com/sY0MtdJ7KG
— Ram Gopal Varma (@RGVzoomin) September 30, 2024
Read Also:AP Liquor Policy Notification: నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..
యానిమల్ సినిమాకు సందీప్ రెడ్డినే ఎడిటర్ కావడంతో బెస్ట్ ఎడిటింగ్ అవార్డు సందీప్ వంగా అందుకున్నాడు. ఈ క్రమంలో స్టేజి మీద సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ఈ అవార్డు ఇచ్చినందుకు ఐఫాకు ధన్యవాదాలు. ఈ విభాగంలో నేను అవార్డు వస్తుందని అసలు ఎప్పుడూ ఊహించలేదు. డైరెక్టర్, నిర్మాత, రైటర్ ఇవన్నీ కాకుండా ఎడిటింగ్ లో వచ్చినందుకు సంతోషంగా ఉంది. చాలా రేర్ అవార్డు ఇది. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలి. నేను ఎడిటింగ్ కేవలం ఆర్జీవీ సర్ సినిమాలు చూస్తూ నేర్చుకున్నాను. మీ సినిమాల నుంచి చాలా నేర్చుకున్నాను, థ్యాంక్యూ ఆర్జీవీ సర్ అని తెలిపారు. దీంతో ఆర్జీవీ ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. సర్ సందీప్ రెడ్డి వంగా నేను ఇప్పుడు మీ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను. మియా మాల్కోవా, దావూద్ ఇబ్రహీం, ఆయాండ్ ర్యాన్, మీ మీద ఒట్టేసి చెప్తున్నాను ఇది అని రిప్లై ఇచ్చారు. దీనికి సందీప్ రెడ్డి వంగా సర్.. అంటూ దండం పెట్టే ఎమోజితో రిప్లై ఇచ్చారు. మొత్తానికి సందీప్ వంగ మాటలు, ఆర్జీవీ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం వర్మ శారీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ తో స్పిరిట్ గా సందీప్ రెడ్డి బిజీ కాబోతున్నాడు.