HanuMan : హనుమాన్ టీం ను ప్రశంసించిన ఆర్జివీ.. వైరల్ అవుతున్న ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ మూవీ హనుమాన్.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొదటి నుంచి ఈ సినిమా పై పాజిటివ్ వైబ్స్ వచ్చేలా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతగానో ప్రయత్నించాడు. అద్భుతమైన గ్రాఫిక్స్ విజువల్స్ తో ప్రేక్షకులలో హనుమాన్ సినిమా పై ఆసక్తి పెరిగేలా చేసారు. సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించి పాన్ ఇండియా స్థాయిలో భారీ గా ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. ఈ సినిమా ఎన్నో అంచనాలతో (జనవరి 12) న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంటుంది.హనుమాన్ చిత్రం అంచనాలకు మించి ఉందంటూ ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హనుమాన్ సినిమా బ్లాక్బాస్టర్ పక్కా అనే చాలా మంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
గురువారమే ప్రీమియర్స్ మొదలుకాగా.. ఆరంభం నుంచే ఈ మూవీకి సూపర్ టాక్ వచ్చింది. అద్భుతమైన విజువల్స్ తో దర్శకుడు ప్రశాంత్ వర్మ మ్యాజిక్ చేసాడు అంటూ ప్రేక్షకులు దర్శకుడిని తెగ పొగిడేస్తున్నారు.దీంతో హనుమాన్ మంచి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో ఈ మూవీ గురించి సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.దర్శకుడు ప్రశాంత్ వర్మ మరియు హీరో తేజ సజ్జాకు అభినందనలు తెలుపుతూ రామ్ గోపాల్ వర్మ నేడు ట్వీట్ చేశారు. “అందరి నుంచి బ్లాక్ బాస్టర్ తెచ్చుకుంటున్న సందర్భం లో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కు కంగ్రాచులేషన్స్. జై హను-మాన్” అని ఆర్జీవీ రాసుకొచ్చారు. అయితే చాలా అరుదుగా వేరే చిత్రాల గురించి ఆర్జీవీ ట్వీట్ చేస్తుంటారు. అందులోనూ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కించిన హను-మాన్ గురించి ఆయన స్పందించడం ఎంతో ఆసక్తికరంగా మారింది. గతంలో రామాయణం విషయంపై ఆయన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.అయితే, తాను హను మాన్ చిత్రం ను చూశారా లేదా అన్నది మాత్రం ఆయన ట్వీట్ చేయలేదు.
Also Read
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
- Suryakumar Yadav: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆ క్షణం మర్చిపోలేను.. ఒళ్లంతా చెమటలు పట్టాయ్..
- 43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
Hey @PrasanthVarma and @tejasajja123 CONGRATULATIONS on the unanimous BLOCKBUSTER TALK ..Jai HANU-MAN 💪💪💪
— Ram Gopal Varma (@RGVzoomin) January 12, 2024
తాజావార్తలు
-
Lava Virat V1 Pro 5G: లావా విరాట్ V1 ప్రో 5G రిలీజ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్లు ఇవే
-
Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
-
Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
-
Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
-
Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!