RGV: పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్? దేశ భవిష్యత్తుతో ఆటలాడొద్దు – ఆర్జీవీ

Rgv

Rgv

నేటి పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అనేది కేవలం ఒక పరికరం కాదు, అది వారి శరీరంలో ఒక అదనపు అవయవంలా మారిపోయింది. ఉదయం కళ్లు తెరవకముందే ఫోన్ వెతకడం, రాత్రి నిద్రపోయే వరకు దాన్ని వదలకుండా ఉండటం ఒక సహజ లక్షణం గా మారిపోయింది. అయితే తాజాగా ఘజియాబాద్‌లో ముగ్గురు సోదరీమణుల ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయాలనే డిమాండ్ పై సంచలన దర్శకుడు ఆర్జీవీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సమాజాన్ని ఉద్దేశించి ఆయన రాసిన “BAN THE BANNERS” నోట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

Also Read : Varanasi: రాజమౌళి వల్లే అది సాధ్యమైంది.. ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

ఆర్జీవీ అభిప్రాయం ప్రకారం.. సోషల్ మీడియా అంటే కేవలం కాలక్షేపం కాదు, అది నాలెడ్జ్ భాండాగారం.. ‘ప్రపంచం ఎంతో వేగంగా ముందుకు వెళ్తోంది. ఇతర దేశాల్లో పిల్లలు యూట్యూబ్, రెడ్డిట్ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా కోడింగ్, సైన్స్ నేర్చుకుంటూ గ్లోబల్ లెవల్‌లో పోటీ పడుతున్నారు. మనం ఇక్కడ నిషేధం విధిస్తే, మన పిల్లలు ఆ పోటీలో వెనుకబడిపోతారు. వాళ్లకు ఏమీ తెలియని దద్దమ్మలుగా మారిపోతారు. మన పిల్లల జీవితాని మనమే పాడు చేసిన వాలం అవుతాము.కేవలం కొందరు చేసే తప్పుల వల్ల మొత్తం టెక్నాలజీని నిషేధించడం మూర్ఖత్వమని ఆయన అభిప్రాయపడ్డారు. రక్షణ పేరుతో పిల్లలకు ఇన్ఫర్మేషన్ అందకుండా చేస్తే, వారి భవిష్యత్తు అంధకారమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ ప్రపంచంపై పట్టు ఉంటేనే కెరీర్ బాగుంటుందని, నిషేధం అనేది పరిష్కారం కాదు’ అని ఆర్జీవీ తేల్చి చెప్పారు ’ అని వర్మ హెచ్చరించారు. అలాగే నిషేధాలు కాదు.. అవగాహనే పరిష్కారం అని కరాకండిగా తెలిపారు.