RGUKT: 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి బాసర, మహబూబ్ నగర్ ఆర్జీయూకేటీ (RGUKT)లో ఎంపికైన విద్యార్థుల తొలి జాబితాను విడుదల చేశారు సంబంధిత అధికారులు. ఈ విషయాన్ని ఇంచార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్, OSD ప్రొఫెసర్ మురళిదర్శన్ సంయుక్తంగా ప్రకటించారు. మొత్తం 20,258 దరఖాస్తులు రాగా.. మొదటి విడతగా 1,690 మంది విద్యార్థుల ఎంపిక జరిగింది.
Read Also: WCL 2025: మరోసారి WCL టోర్నీ.. టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఈ ఎంపికలో బాలికలు అత్యధికంగా ప్రాధాన్యత పొందారు. విడుదలైన జాబితాలో 72% సీట్లు బాలికలకు, 28% సీట్లు బాలురకు కేటాయించబడ్డాయి. అలాగే, ఎంపికైన వారిలో 88% మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చినవారే కావడం గమనార్హం. ఇక జిల్లాల వారీగా గమనిస్తే.. నిజామాబాద్ జిల్లాకు అత్యధికంగా 297 సీట్లు, కాగా జయశంకర్ జిల్లాకు కేవలం 1 సీటు మాత్రమే వచ్చినట్లు వెల్లడించారు.
Read Also:Election Commission: తెలంగాణలో గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు ఈసీ బిగ్ షాక్..
ఎంపికైన విద్యార్థులకు జూలై 7, 8, 9 తేదీలలో యూనివర్సిటీ క్యాంపస్‌లలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఇంచార్జ్ వీసీ తెలిపారు. కౌన్సెలింగ్ తేదీలను పరిశీలించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముందస్తుగా సిద్ధమవ్వాలని అధికారులు సూచించారు. అలాగే బాసర, మహబూబ్ నగర్ ఆర్జీయూకేటీ ఎంపిక జాబితాను సాయంత్రం 6 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని పేర్కొన్నారు.