NTV Telugu Site icon

Minister Dharmana Prasada Rao: టైటిలింగ్ యాక్ట్ చట్టం ఇంకా అమలు చేయలేదు..

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

Revenue Minister Dharmana Prasada Rao: టైటిలింగ్ యాక్ట్ చట్టం ఇంకా అమలు చేయలేదని.. ఈ చట్టంపై అడ్వకేట్స్ కొన్ని అభ్యంతరాలు చెబుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రాష్ట్రంలో త్వరితగతిన రీ సర్వే పూర్తి అవుతుందని ఆయన ప్రకటించారు. ఇంకా రూల్స్ తయారు చేయలేదు , అసెంబ్లీ చర్చించలేదని.. న్యాయవాదుల సలహాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆదరా బాదరాగా టైటిలింగ్ యాక్ట్‌ను ప్రభుత్వం అమలు చేయదన్నారు. దేశం మొత్తం చట్టం అమలు జరుగుతుందని.. సరైన టైటిల్ లేఖ పోతే ధనవంతుల చేతికి బీదల భూములు వెళ్లిపోతున్నాయన్నారు. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు ముఖాముఖి మాట్లాడటానికి అభ్యంతరం లేదన్నారు. న్యాయవాదులు విధులకు హాజరు కావాలని కోరుతున్నామన్నారు. ఇల్లు పట్టా రిజిస్ట్రేషన్ కోసం సచిచాలయంకు వెళితే సరిపోతుందని.‌. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంకు వెల్లాల్సిన పనిలేదన్నారు. పట్టా, అధార్ కార్డ్ తీసుకుని వెళ్తే పైసా ఖర్చు లేకుండా పనిచేస్తారని మంత్రి ధర్మాన వెల్లడించారు.

Read Also: GVL Narasimha Rao: ఉత్తరాంధ్రకు ఎంపీ జీవీఎల్ గుడ్‌న్యూస్.. రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం!

ఇదిలా ఉండగా.. వంశధార ప్రాజెక్ట్‌ గురించి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. రెండు లక్షల ఎకరాలకు నీరందించేందుకు చెపట్టిన ప్రాజెక్ట్ వంశధార అని.. గొట్టావద్ద ఎత్తిపోతలతో వంశధార ఫేజ్‌-2 ద్వారా రిజర్వాయర్‌ను ఉపయోగించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆప్ షో పనులు ప్రారంభం అయ్యాయన్నారు. ఒడిశాతో విభేదాలు అడ్డంకిగా ఉండటంతో ఒడిశా వెళ్లి కలిసి వివాదాలు తొలగించే ప్రయత్నం సీఎం జగన్ చేశారని మంత్రి తెలిపారు. ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుండటంతో సీఎం చొరవ తిసుకొని 180 కోట్ల ఎత్తిపొతల పథకం పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారన్నారు. ప్రాజెక్ట్ వెనుక రాజశేఖరరెడ్డి , జగన్మోహన్ రెడ్డి కృషి చేశారన్నారు.