NTV Telugu Site icon

Revanth Reddy : అధికారంలోకి వస్తే ప్రగతిభవన్‎ను అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్‎గా మారుస్తాం

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy : అసెంబ్లీ లో కేటీఆర్ విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‎లో లంచ్ పాయింట్ దగ్గర టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. తనపై ఏ ఆరోపణ ఉన్నా సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్ధమన్నారు. అలాగే ఈ ప్రభుత్వంపై తాను చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ విచారణకు సిద్ధంగా ఉండాలంటూ సవాల్ విసిరారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూములను ఎన్నివేల ఎకరాలు ఆ జాబితా నుంచి తొలగించారు.. అవి ఎవరెవరి పేర్ల మీద బదలాయించారో బయటపెట్టాలన్నారు రేవంత్ రెడ్డి.

Read Also: RTC Bus Conductor: ఆర్టీసీ కండక్టర్‌ మృతి కేసులో ట్విస్ట్‌.. అసలు కారణం ఇదేనా..?

అటవీ ప్రాంతంలో గిరిజన, ఆదివాసులకు కాంగ్రెస్ హయాం (2006)లో 10లక్షల ఎకరాల పంపిణీ చేశారు. అసైన్డ్, పోడు భూములు కలిపి దాదాపుగా 35 లక్షల ఎకరాల భూములను కాంగ్రెస్ పంచిందన్నారు. గిరిజనులను భూమి యజమానులను చేసింది కాంగ్రెస్.. భూమి అంటే తల్లితో సమానము. 69 లో తెలంగాణ ఉద్యమం భూములకోసమే జరిగింది. ఇప్పుడు కూడా భూముల కోసమే ఉద్యమాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ నిజాం నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను డ్రామారావు, మిత్ర బృందం కొల్లగొట్టిందంటూ ఆరోపించారు.

Read Also: Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డి ప్రగతి భవన్‌పై అలా అనకుండా.. ఇలా అంటే బాగుండేది..

శాసన సభలో సభ్యుడు లేనప్పుడు పేరు ప్రస్తావించకూడదన్న జ్ఞానం కేటీఆర్ కు లేదన్నారు రేవంత్ రెడ్డి. తాను సభలో ఉంటు అక్కడే సమాధానం ఇచ్చి ఉండేవాడినన్నారు. అక్రమాలు చేసే అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కటకటాల్లో వేస్తామన్నారు అలాగే తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ గా మారుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ గడీల పాలనకు వ్యతిరేకం… యాత్రను అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. అందుకే యాత్రకు పోలీసు బందోబస్తు తీసేశారంటూ మండిపడ్డారు. యాత్రలో గందరగోళం సృష్టించే అవకాశం ఉందని… అప్రమతంగా ఉండాల్సిందిగా కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.