Site icon NTV Telugu

Revanth Reddy : 25 వేల సభ్యత్వాలు నమోదు చేయాలి.. లేకుంటే అంతే.. నేతలకు షాకిచ్చిన రేవంత్‌..

Revanthreddy Ktr

Revanthreddy Ktr

యూత్ లోకి కాంగ్రెస్ వెళ్ళాలని పార్టీ నేతలను దిశానిర్దేశం చేశారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. ఆయన ఆయన మాట్లాడుతూ.. యూత్ డిక్లరేషన్ నియోజకవర్గం లో 25 వేళా మంది ఎన్రోల్ చేయించాలన్నారు. నియోజక వర్గంలో 25 వేలు ఎన్రోల్ చేస్తేనే… టికెట్ పరిశీలన అని, లేదంటే పేరు కూడా పరిశీలన జాబితాలో ఉండదని ఆయన వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావం లో బీఆర్‌ఎస్‌ పాత్ర లేదని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. ఆవిర్భావ దినోత్సవంని గ్రాండ్ గా మనమే చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.

 
తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ మీద సానుభూతి తో ఉన్నారని, మనమే పని చేసుకోవాలన్నారు. కాంగ్రెస్‌లో కోవర్టులు లేరని, నేను 10 అడుగులు తగ్గి పని చేస్తానని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత అంశాలు పక్కన పెట్టి పని చేద్దామని, విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్‌ను గద్దె దించి.. తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తామంటూ ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తామన్నది కూడా లెక్క తేల్చారు. ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్‌ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే.. తెలంగాణలో 80 సీట్లు గెలిచి.. అధికారం చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు.

Chandragiri: శానంభట్ల మంటల మిస్టరీ వీడింది.. జనాలను హడలెత్తించిన కీర్తి

Exit mobile version