Site icon NTV Telugu

Revanth Reddy : ‘కల్వకుంట్ల రాజ్యంలో మాయమైపోయిన తెలంగాణం’

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy : తెలంగాణలో పలువురు ఐపీఎస్‎లకు బదిలీలతో పాటు పదోన్నతి కలిగింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీపీసీసీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఐపీఎస్ ల పోస్టింగ్ లలో తెలంగాణ అధికారులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. డీజీపీతో సహా ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు కీలక పోస్టింగులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అందులో ఒక్కరు కూడా తెలంగాణ మూలాలు ఉన్న అధికారులు లేకపోవడం పై రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. “కల్వకుంట్ల రాజ్యంలో.. నిన్న పార్టీలో.. నేడు పరిపాలనలో మాయమైపోయిన “తెలంగాణం” అని రేవంత్ ట్వీట్ చేశారు.

Read Also: TSPSC Group 2: తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో పలువురు ఐపీఎస్‎లకు బదిలీలతో పాటు పదోన్నతి కలిగింది. తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ నియామకం అయ్యారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం అంజనీకుమార్ అవినీతి నిరోధక విభాగం డీజీగా ఉన్న సంగతి తెలిసిందే.జనవరి 1 నుంచి తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా ఆయన విధులు నిర్వహించనున్నారు. ఆయన స్థానంలో ఏసీబీ డీజీగా రవి గుప్తా నియమితులయ్యారు. సీఐడీ అదనపు డీజీగా మహేశ్ భగవత్, రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా జితేందర్, లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్ కుమార్ జైన్ లను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read Also: Corona BF7: ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ వస్తేనే ఎంట్రీ.. లేదంటే ఎయిర్ పోర్టులోనే బ్రేక్

Exit mobile version