NTV Telugu Site icon

Revanth Reddy : కొడంగల్‌లో హాత్ సే హాత్ జోడో అభియాన్ ప్రారంభం

Revanth Reddy

Revanth Reddy

కొడంగల్ నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ ను లాంఛనంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం మదనపల్లిలో హాత్ సే హాత్ జోడో యాత్రను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మదనపల్లి హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించి యాత్ర కరపత్రాలను విడుదల చేశారు రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 6 నుంచి 60రోజులపాటు హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకే అన్నట్లు..నేను పీసీసీ అధ్యక్షుడినైనా.. మీ వాడిని అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో మీరు ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసామని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ పేదవాడికి అన్నిరకాల సహాయం అందించిందన్నారు.

Also Read : Pakistan Crisis: పాక్‌లో మరింత ముదిరిన సంక్షోభం.. మంత్రులు, ఉద్యోగాల్లో కోత

కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లయినా పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన మాట ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. పంట బీమా ఇవ్వకుండా… రైతు చనిపోతే డబ్బులిస్తాడట అంటూ ఆయన ధ్వజమెత్తారు. ధరణి దరిద్రం పోవాలంటే కేసీఆర్ ఉద్యోగం పోవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. షాదీముబారక్, కల్యాణ లక్ష్మీ కేసీఆర్ పోయినా ఆగదని, అంతకు అంతకు కలిపి ఆ కళ్యాణ లక్ష్మీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా పెన్షన్ ఆగదని ఆయన పేర్కొన్నారు.

Also Read : Nandamuri Balakrishna: అక్కడ ఆప్యాయత లేదు.. మరోసారి మాట తూలిన బాలయ్య