Revanth Reddy : ఇది కాంగ్రెస్ గిరిజనులకు ఇచ్చిన గౌరవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కడో మారుమూల తాండా నుంచి వచ్చిన బలరాం నాయక్ కు కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్దండులు ఉన్న నల్లగొండ జిల్లాలో శంకర్ నాయక్ కు జిల్లా అధ్యక్షుడుగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్నారు. ఇది కాంగ్రెస్ గిరిజనులకు ఇచ్చిన గౌరవమని ఆయన వ్యాఖ్యానించారు. గిరిజనులకు వేలాది ఎకరాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, ఈ ఎనిమిదేళ్ల పాలనలో టీఆరెస్, బీజేపీ గిరిజనులకు ఏమిచ్చాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ గిరిజనులకు ఇచ్చిన భూములను గుంజుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
కొత్త సీసాలో పాత సారాలా టీఆర్‌ఎస్, బీజేపీ ప్రజల ముందుకు వస్తున్నాయని ఆయన విమర్శించారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నపుడు రాజగోపాల్ రెడ్డి ఏం వెలగబెట్టారని ఆయన ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్లుగా మంత్రిగా ఉన్న మూడడుగుల జగదీష్ రెడ్డి గిరిజనులకు ఏం చేశారంటూ ఆయన ఎద్దేవా చేశారు. స్రవంతిని గెలిపిస్తే పోడు భూముల సమస్యపై కోట్లాడి పట్టాలు ఇప్పించే బాధ్యత మాదని, మోదీ అయినా కెడీ అయినా.. కొట్లాడి పోడు భూములకు పట్టాలిప్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. నన్ను మాల్కాజ్ గిరిలో గెలిపించినట్లుగానే… మునుగొడులో స్రవంతిని గెలిపించండని ఆయన కోరారు. ఈ పార్టీ మీది… చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించండని ఆయన ప్రజలను కోరారు.
Also Read
- Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్‌షీట్‌పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
తాజావార్తలు
-
Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్‌షీట్‌పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!