NTV Telugu Site icon

Revanth Reddy : కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం తెచ్చిన ఉప ఎన్నిక ఇది

Revanth Reddy Congress

Revanth Reddy Congress

మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ కోరుకోలేదని, కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం తెచ్చిన ఉప ఎన్నిక ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఈ ఉప ఎన్నికతో ప్రజకు లాభం కలగాలి.. కానీ అలాంటి నాయకులకు కాదు. సర్పంచులను గెలిపిస్తే నిధులు ఇవ్వని వారు.. ఇపుడు ఎమ్మెల్యేను గెలిపిస్తే ఇస్తారా. వేలాది ఎకరాలు భూములు గుంజుకుని గుంట నక్కల్లా టీఆరెస్ నాయకులు ఇక్కడ తిరుగుతున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులారా మునుగొడులో చర్చకు రండి. సమస్యలపై చర్చించి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలో చెప్పండి. ప్రజలారా మీ ఆడబిడ్డ స్రవంతిని గెలిపించండి. కేంద్రంలో , రాష్ట్రంలో అధికారంలో ఉన్నవాళ్లు దోపీడీ సొమ్ముతో ముఠాలతో మన గ్రామాలకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని చంపాలని కుట్ర చేస్తున్నరు.

 

మునుగోడు గడ్డపై గెలవకపోతే కాంగ్రెస్ ను చంపాలనుకున్న వారి కుట్ర గెలుస్తది. వేల కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ పై బీజేపీ ఎందుకు కేసులు పెట్టడం లేదు. బీజేపీ,టీఆరెస్ రెండూ ఒక్కటే. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందనే వాళ్లకు ఒకటే చెబుతున్న. కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉంది, మారుమూల పల్లెల్లో ఉంది. నేను అనని మాటను అన్నట్లుగా కమ్యూనిస్టు నేత సాంబశివరావు చిత్రీకరిస్తున్నారు. కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని నేను అనలేదు. మీ ఎమ్మెల్యేలను కొనుక్కున్న వారితో ఎలా కలిశారని మాత్రమే అన్నానని ఆయన స్పష్టం చేశారు.