Revanth Reddy: కేసీఆర్ తన కుమార్తె కోసం బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. 5 సీట్లలో మామూలు అభ్యర్థులను నిలబెట్టారన్నారు. అందులో మల్కాజ్ గిరి సీట్ కూడా ఒకటన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిరిగిలో ఆయన మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలని.. హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గతంలో గెలిచిన రాజేందర్ కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. మళ్ళీ అదే రాజేందర్ ను ఎందుకు ఓటర్లు ఓడించారో అందరికీ తెలుసని విమర్శించారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రంతో ఎందుకు దర్యాప్తు చేయించలేక పోయారని అడిగారు. కేటీఆర్ అవినీతిపై ఒక్కసారి కూడా రాజేందర్ ఎందుకు ప్రశ్నించలేదు? వారి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటి? అని ప్రశ్నించారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుట్రలు పన్ని 2018లో కొడంగల్ లో తనను ఓడిస్తే.. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ప్రజలు ఎంపీగా గెలిపించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ అభివృద్ధి కోసం ప్రతిపక్షంలో ఉండి పోరాడానన్నారు. కాని గత ప్రభుత్వం తనను అడ్డుకుందని తెలిపారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ లో పెట్టుబడులు రాకపోవడంతో అభివృద్ధి నిలిచిపోయిందని పేర్కొన్నారు. పడిపోతున్న తనను ఎంపీగా గెలిపించడం వల్లే కేసీఆర్ తో ప్రజా సమస్యలపై కొట్లాడినట్లు చెప్పారు. ఆ స్ఫూర్తితోనే పోరాడి ముఖ్యమంత్రి అయ్యానని స్పష్టం చేశారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన పార్టీకి చెందిన అభ్యర్థి ఎంపీగా గెలిస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. సునితను ఎంపీగా గెలిస్తే మహేందర్ రెడ్డి సైతం చీఫ్ విప్ గా మీ సమస్యల పరిష్కారంలో ముందు ఉంటారన్నారు.
READ MORE: VIrat Kohli Sunil Narine: కోహ్లీ బ్రో.. నరైన్ కు ఏ జోక్ చెప్పావ్.. అంతలా నవ్వేస్తున్నాడు..
రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిన మోడీ మెడలు వంచి.. వెనక్కి తీసుకునేలా రైతులు పోరాడారని గుర్తు చేశారు. ఒక్క పైసా నల్ల ధనాన్ని పేదల ఖాతాలో వేయని మోడీ ఓటు అడిగే హక్కు లేదన్నారు. మత రాజకీయాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని.. కమ్యూనిస్ట్ గా చెప్పుకునే రాజేందర్ ఎలా ఆ పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. రాముడి పేరు మీద బీజేపీ ఎన్నో రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. తానూ హిందువుని, దేవుణ్ణి నమ్ముతానని.. ప్రతి మతస్థుడు వాళ్ల ధర్మాన్ని, జాతిని నమ్ముతాడని… అది రాజ్యాంగం కల్పించిన హక్కన్నారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలన్నారు. దేవుడిని గోడల మీదకు తెచ్చి రాజకీయం చేస్తున్న బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఆకలిలో భారత్ 125 దేశాల్లో 111వ స్థానంలో ఉందని.. దరిద్రం దేశంలో తాండవిస్తోందని తెలిపారు.