Site icon NTV Telugu

Revanth Reddy : మోడీ.. కలియుగ నియంత

హాత్‌ సే హాత్‌ జోడో పేరిట టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్రను ఏప్రిల్ 6 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. సిట్‌ విచారణ తప్పుదోవ పట్టిస్తున్న నేపథ్యంలో ఢిల్లీకి పోయి ఫిర్యాదు చేస్తామన్నారు. నిరుద్యోగ నిరసన ఏప్రిల్ రెండో వారంలో చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం రాహుల్ గాంధీ అంశంపై మాట్లాడుతూ.. ఇది దుర్మార్గమన్నారు. ఆదానీపై చర్చ జరుగకుండా బీజేపీ చూస్తుందని, ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని ఆయన అన్నారు. నియంతలు కాలగర్భంలో కలిశారని ఆయన విమర్శించారు.

Also Read : Redmi Note 12 4G: 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా.. అదిరే ఫీచర్స్ ఇవే

మధ్య యుగ కాల చక్రవర్తి అనుకుంటున్నాడు మోడీ అని, ఇలాంటి విపరీత పోకడ ప్రజా స్వామ్యంకి మంచిది కాదన్నారు. కోర్టు వేసిన శిక్షకి 30 రోజులు గడువు ఉందని, గడువు లేకుంటే జైలుకే తీసుకుపోయే వాళ్ళు కదా అని, ప్రజా స్వామ్య వాదులు ఆలోచన చేయండని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి దేశం అండగా ఉంటుందని, పగతో పరిపాలన చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పాదయాత్రతో రాహుల్ గాంధీ.. మోడీ వైఫల్యాలు జనం ముందు పెట్టారని, మోడీ.. కలియుగ నియంత సమాజం అంతా గమనించాలని ఆయన ఆరోపించారు.

Also Read : Raghav Chadha: బాలీవుడ్‌ గ్లామరస్ బ్యూటీతో డేటింగ్.. వైరల్‌ వీడియోలపై స్పందించిన ఆప్ నేత!

సంస్థల స్వతంత్రత కోల్పోతే నష్టం వాటిల్లుతుందని, న్యాయం చేస్తున్నట్టు ప్రజలకు అనిపించాలని, కోర్టు వ్యవహారం పార్లమెంట్‌లో మాట్లాడతామన్నారు. రాహుల్ గాంధీ… పై వేసిన కేసులో పిటిషనర్ కింది కోర్టు నుండి హైకోర్టీకి వెళ్ళాడని, కింది కోర్టు జడ్జి మారినా తరవాత.. మళ్ళీ కింది కోర్టుకు వచ్చాడన్నారు. కేటీఆర్.. నాలుగు కోట్ల ప్రజల పరువు తీశాడని, ప్రజల పరువు తీసిన వాడికి పరువు ఎక్కడిదన్నారు. పరువు ఉన్నోడు పరువు నష్టం వేయాలని, కేటీఆర్ మంత్రి కావడమే దురదృష్టకర ఘటన అన్నారు. దీన్ని సెట్ చేయడానికే కేటీఆర్ ని బర్తరఫ్ చేయాలని అడుగుతున్నామన్నారు.

Exit mobile version