Site icon NTV Telugu

Revanth Reddy : ఈ పాలకులు ప్రజాస్వామ్య వాదులను భయపెట్టాలని చూస్తున్నారు

Revanth Reddy

Revanth Reddy

ప్రొఫెసర్‌ హరగోపాల్ తో పాటు మరో 152 మందిపైన తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లలో ఉపా కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ పాలకులు ప్రజాస్వామ్య వాదులను భయపెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రొఫెసర్‌ హరగోపాల్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప మేధావని, ఆయన పౌర హక్కుల కోసం అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడి ప్రజా హక్కులను కాపాడిన మానవతా వాది అని ఆయన కొనియాడారు. సెంట్రల్ యూనివర్సిటీలలో పౌర హక్కుల కోసం పాఠాలు బోధించిన ప్రొఫెసర్ అని, తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పని చేసిన ఉద్యమ కారుడన్నారు. నక్సలైట్ ఎజెండా నే మా ఎజెండా అని ప్రకటించిన కేసీఆర్, హరగోపాల్ నక్సలైట్లకు సహకరిస్తూ దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని కేసులు పెట్టడం ఒక అప్రజాస్వామిక చర్య అన్నారు. ఒకవేళ ప్రభుత్వ దృష్టిలో హరగోపాల్ దోషి అయితే నక్సలైట్ల ఏజండా నే మా ఏజండా అన్న కేసీఆర్ కూడా దోషినే కదా అని ఆయన అన్నారు.

Also Read : Adipurush : ప్రభాస్ యాక్టింగ్, హనుమంతుడి స్క్రీన్ ప్రెజన్స్.. సినిమాలోని హైలెట్స్ ఇవే ..

అంతేకాకుండా.. ‘నక్సలైట్ల ఎజెండానే మా ఏజండా అని ప్రకటించిన కేసీఆర్ పైన కూడా కేసులు పెడతారా.. హరగోపాల్ తో పాటు 152 మంది పైన కేసులు ఎత్తేయాలి. తెలంగాణ పౌర, ప్రజాస్వామిక సంఘాలు రాజకీయ పక్షాలు హరగోపాల్ కు అండగా ఉండాలి.. హరగోపాల్ తో పాటు 152 మంది పైన ఉపా కేసులు ఎత్తేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ప్రజాస్వామిక పౌర సంఘాలు బీజేపీ, బీఆర్‌ఎస్‌ లకు వ్యతిరేకంగా ప్రజల కోసం పై చేస్తుండడంతో ప్రభుత్వాలు ఇలా పాశవికంగా ప్రవర్తిస్తున్నాయి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హరగోపాల్ తోపాటు 152 మంది పైన ఉపా కేసులు ఎత్తేస్తామన్నారు రేవంత్‌ రెడ్డి.

Also Read : Salaar: సలార్ లో రాఖీ భాయ్.. కథ తెలిసిపోయింది..?

Exit mobile version