NTV Telugu Site icon

Revanth Reddy : నేడు రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరాహార దీక్ష

Revanthreddy Kcr

Revanthreddy Kcr

కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండల కేంద్రంలో నేడు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు చేపట్టనున్న ఈ దీక్షకు అందరూ తరలిరండని ఆయన పిలుపునిచ్చారు. గాంధారి శివాజీ చౌక్ వద్ద నిరుద్యోగ నిరసన ఈ దీక్షను చేపట్టనున్నారు రేవంత్ రెడ్డి. ఉదయం 9గంటలకు జువ్వాడి గేట్ నుంచి గాంధారి శివాజీ చౌక్ వరకు పాదయాత్రగా రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శివాజీ చౌక్ వద్ద దీక్ష చేపట్టనున్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయించాలని డిమాండ్‌తో ఈ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. మంత్రి కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ప్రధాన డిమాండ్ల తో దీక్ష చేయనున్నారు.

Also Read : CM YS Jagan: నేడు తిరువూరులో సీఎం పర్యటన.. వారికి ఖాతాల్లో ఈ రోజే సొమ్ము జమ..

ఇదిలా ఉంటే.. నిన్న రేవంత్‌ రెడ్డి కామారెడ్డి హాత్‌ సే హాత్‌ జోడో పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుతూ.. కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కొడుకు కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడని ఆరోపించారు. ఇక్కడ చదవని కేటీఆర్ కు తెలంగాణ కు ఏం సంబంధం? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. 610 జీవో, ముల్కీ రూల్స్ ప్రకారం కేటీఆర్ తెలంగాణలో చప్రాసి ఉద్యోగానికి కూడా పనికిరాడని, పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్ పీఏకు సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయన్నారు.

Also Read : Wife Plan: భర్తను సిగరెట్‌ తాగొద్దంటే వినలేదు.. భార్య మాస్టర్‌ ప్లాన్‌..

Show comments