CM Revanth Reddy: ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు, కృష్ణ తెలుగు సినిమాకి నాలుగు మినార్లు..

Cm Reavnth

Cm Reavnth

CM Revanth Reddy: ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు, కృష్ణ తెలుగు సినిమాకి నాలుగు మినార్లు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నిన్న (గురువారం) రాత్రి మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మాట్లాడారు. హైదరాబాద్‌కు చార్ మినార్లు ఎలానో తెలుగు సినిమాకు వాళ్ళు అలానే అని కొనియాడారు. ఆగిపోయిన నంది అవార్డ్స్ ను గద్దర్ పేరుతో మళ్ళీ తీసుకువచ్చామని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒకటే చెప్పాలి అనుకుంటున్నానన్నారు. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం తన బాధ్యత అని చెప్పారు. జపాన్ కొరియా వంటి దేశాల్లో సినిమా రంగం ఎదగడానికి అక్కడున్న ప్రభుత్వాలే కారణమన్నారు.

READ MORE: GaddarFilmAwards : సినిమా వాళ్లని ఎంకరేజ్ చేయడంలో AP వెనుకబడి ఉంది – చిరంజీవి

“ఇటీవలే నెట్ ఫ్లిక్స్ ఐ లైన్ ప్రారంభించాం.. నెట్ ఫ్లిక్స్ వచ్చిదంటే హాలీవుడ్ వచ్చినట్టే.. మీకు సంబంధించి పర్మిషన్స్ ఇవ్వడానికి సింగిల్ విండో సిస్టమ్ తీసుకువస్తాం.. భట్టి విక్రమార్క సూచన చేస్తున్న సింగిల్ విండో సిస్టమ్ పై ఆలోచన చేయాలి.. మును కావల్సిన అన్ని పర్మిషన్స్ ఇవ్వడానికి ఒకే సిస్టమ్ తీసుకువస్తాం.. గద్దర్ అనే పేరు యుద్ధం.. గద్దర్ అంటే తెలియని వారెవరు లేరు.. గద్దర్ అంటే ఎన్నో సామాజిక రుగ్మతలను రూపుమాపిన వ్యక్తి.. సినిమా అంటే పవర్ ఫుల్ వెపన్.. గద్దర్ స్పూర్తితో ఫిల్మ్ ఇండస్ట్రీ సామాజిక రుగ్మతలను పరిష్కరించడానికి సినిమాలను వినియోగించాలి..” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.